...
...
Next Story

థగ్ లైఫ్ మూవీ రివ్యూ.. కమల్ హాసన్, త్రిష, శింబు గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. కమల్‌తోపాటు త్రిష, శింబు, అభిరామి, జోజు జార్జ్, నాజర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ ఇవాళ (జూన్ 5) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి థగ్ లైఫ్ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Jun 5, 2025, 13:58:47 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టైటిల్: థగ్ లైఫ్

థగ్ లైఫ్ మూవీ రివ్యూ.. కమల్ హాసన్, త్రిష, శింబు గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
థగ్ లైఫ్ మూవీ రివ్యూ.. కమల్ హాసన్, త్రిష, శింబు గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

నటీనటులు: కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, జోజు జార్జ్, నాజర్, సాన్య మల్రోత్రా, ఐశ్వర్య లక్ష్మీ, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్ తదితరులు.

దర్శకుడు: మణిరత్నం

సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్

ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, శివ అనంత్

విడుదల తేది: జూన్ 5, 2025

నాయగన్ (నాయకుడు) తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం థగ్ లైఫ్. సుమారు 38 ఏళ్ల తర్వాత ఇద్దరు లెజండరీ కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ భారీ అంచనాల నడుమ ఇవాళ (జూన్ 5) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి థగ్ లైఫ్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

అన్నదమ్ములు అయిన రంగరాయ శక్తి రాజన్ (కమల్ హాసన్), మాణిక్యం (నాజర్) ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్. ఓరోజు వీరిపై పోలీసులు అటాక్ చేస్తారు. కట్ చేస్తే భవిష్యత్తులో బిజినెస్ పరంగా రంగరాయ శక్తి రాజన్

అదే సమయంలో న్యూస్ పేపర్స్ వేసే ఓ ఫ్యామిలీలో తండ్రి చనిపోతాడు. అతని కొడుకు అమర్ (శింబు), కూతురు చంద్ర తప్పిపోతారు. దాడి సమయంలో రంగరాయను అమర్ కాపాడుతాడు. దాంతో అమర్‌ను అన్నగా, తండ్రిగా తీసుకుని వెళ్లి చూసుకుంటాడు.

అమర్ చెల్లిని తానే వెతికి పెడతానని మాటి ఇస్తాడు రంగరాయ. కొన్నాళ్ల తర్వాత ఒకరిని చంపిన కేసులో రంగరాయన్ శక్తి రాజన్ జైలుకు వెళ్తాడు. అధికారం అంతా అమర్‌కు ఇచ్చి వెళ్తాడు. జైలు నుంచి రంగరాయ శక్తి రాజన్ తిరిగి వచ్చేసరికి పరిస్థితి అంతా మారుతుంది. శత్రువులతో అమర్ చేతులు కలుపుతాడు. రంగరాయ శక్తి రాజన్‌పై అటాక్స్ జరుగుతుంటాయి.

థగ్ లైఫ్ ట్విస్టులు

థగ్ లైఫ్ ఒక గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. 38 ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా అంటే చాలా హైప్స్ ఉన్నాయి. కానీ, ఆ అంచనాలను అంతగా అందుకోలేకపోయింది థగ్ లైఫ్ చిత్రం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో నాయగన్ వంటి కల్ట్ క్లాసిక్ చూసిన అభిమానులు థగ్ లైఫ్‌తో కాస్తా నిరాశ చెందారనే చెప్పొచ్చు.

ఇక థగ్ లైఫ్ సినిమా కథ ఏంటో ప్రచార చిత్రాల్లోనే పూర్తిగా చూపించేశారు. కాపాడిన పిల్లాడిని కొడుకులా చూసుకున్న తండ్రికి అతని నుంచి ద్రోహం ఎదురైతే ఎలా ఉంటుంది, అందుకు గల కారణాలు ఏంటీ అనే ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగింది. అయితే, మొదటి 20 నిమిషాలు మాత్రం చాలా ఎగ్జైటింగ్‌గా సాగుతుంది.

ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్స్

ఆ తర్వాత సినిమా అంతా దాదాపుగా రొటీన్ ఫ్లేవర్‌లోనే ఉంటుంది. చాలా వరకు సన్నివేశాలు ఊహించేసేలా ఉంటాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ముఖ్యంగా కమల్-శింబు మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, ఏఆర్ రెహమాన్ మ్యూజికి అంతగా వర్కౌట్ కాలేదు. ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. టెక్నికల్ వాల్యూస్ రిచ్‌గానే ఉన్నాయి.కమల్ హాసన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్‌తోపాటు శింబు తన నటనతో అదరగొట్టాడు.

ఎందుకు చూడాలంటే?

మిగతా భారీ తారాగణం అంతా పరిధి మేర నటించారు. అయితే, వారి క్యారెక్టరైజేషన్ అంత బలంగా రాసుకోకపోవడం మైనస్. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ డ్రామా అయిన థగ్ లైఫ్ మూవీని యాక్షన్ సీక్వెన్స్, కమల్, శింబుయాక్టింగ్ కోసం చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks