కమల్ హాసన్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? థగ్ లైఫ్ డిజిటల్ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ ఇదే!

భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన కమల్ హాసన్ లేటెస్ట్ సినిమా థగ్ లైఫ్ కలెక్షన్లలో మాత్రం తేలిపోయింది. రిలీజై 9 రోజుల అయినా రూ.50 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో థగ్ లైఫ్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోందనే క్రేజీ బజ్ వినిపిస్తోంది. 

Published on: Jun 14, 2025, 14:05:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. థియేటర్లలో ఈ మూవీ తీవ్రంగా నిరాశపరుస్తోంది. అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా ఓటీటీ బాట పట్టబోతోందనే క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్ ఫామ్, మేకర్స్ మధ్య చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో కమల్ హాసన్, సిలంబరసన్ టీఆర్, త్రిష, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

థగ్ లైఫ్ పోస్టర్ (x)
థగ్ లైఫ్ పోస్టర్ (x)

రిలీజ్ కు ముందే ఓటీటీ రైట్స్

థగ్ లైఫ్ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.149.7 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను విజయ్ టీవీ రూ.60 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో థగ్ లైఫ్ థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా రూ.210 కోట్లు వచ్చాయి.

ఆ డేట్

సాధారణంగా అయితే ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. స్టార్ హీరోల సినిమాలు, బ్లాక్ బస్టర్ మూవీస్ కొన్నిసార్లు ఆలస్యంగా ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ థగ్ లైఫ్ మూవీని థియేట్రికల్ రిలీజ్ అయిన 8వ వారం తర్వాత ఓటీటీలోకి తీసుకొస్తామని నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అంటే ఆగస్టు 7న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

ప్లాన్ ఛేంజ్ అయ్యేనా?

అయితే థియేటర్లలో థగ్ లైఫ్ కు షాక్ తగలడంతో ఈ సినిమా ముందుగానే ఓటీటీలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు వారాల్లో లేదంటే అంతకంటే ముందే ఈ మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అంటే జూన్ నెల చివర్లో లేదా జులై మొదటి వారంలో ఈ మూవీని ఓటీటీలో చూసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు మేకర్స్ తో నెట్‌ఫ్లిక్స్‌ చర్చలు జరుపుతున్నట్లు టాక్. మొదట తమిళ్, తెలుగు, కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని.. ఆ తర్వాత హిందీలో యాడ్ చేస్తారని తెలిసింది.

షాకింగ్ కలెక్షన్లు

భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన హై వోల్టేజీ యాక్షన్థ్రిల్లర్ థగ్ లైఫ్ కు షాకింగ్ కలెక్షన్లు వస్తున్నాయి. 9 రోజుల్లో కలిపి ఇప్పటివరకూ రూ.50 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. 9 రోజుల్లో ఇండియాలో రూ.44.75 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రాబట్టిందని సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. 37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం తిరిగి సినిమా చేశారు. కానీ ఆ మ్యాజిక్ పనిచేయలేకపోయింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More