...
...
Next Story

ముందుగానే ఓటీటీలోకి థగ్ లైఫ్.. కమల్ హాసన్ సినిమా వచ్చేది అప్పుడేనా?

ఎన్నో అంచనాలతో థియేటర్లకు వచ్చేసిన కమల్ హాసన్ బిగ్ ప్రాజెక్ట్ థగ్ లైఫ్ బొక్క బోర్లా పడింది. తొలి నాలుగు రోజుల్లో కలెక్షన్లు ఏమంత గొప్పగా లేవు. దీంతో ఈ మూవీ డిజాస్టర్ దిశగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థగ్ లైఫ్ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ నెలకొంది.

Published on: Jun 9, 2025, 14:22:50 IST
By ,
Prefer HTon Google
Advertisement

37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబో రిపీట్ కావడం.. త్రిష, సిలంబరసన్ లాంటి వాళ్లు నటించడం.. యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ రావడం.. ఇలా థగ్ లైఫ్ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తీరా సినిమా థియేటర్లకు వచ్చాక మాత్రం ఊహించని ఫలితం కనిపిస్తోంది. కన్నడ భాష వివాదంతో కర్ణాటకలో రిలీజ్ కాలేకపోయిన థగ్ లైఫ్ కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీలోకి ముందుగానే వస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఆ ఓటీటీలోకి

కమల్ హాసన్, మణిరత్నం (x/ikamalhaasan)
కమల్ హాసన్, మణిరత్నం (x/ikamalhaasan)

థగ్ లైఫ్ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.149.7 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను విజయ్ టీవీ రూ.60 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో థగ్ లైఫ్ థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా రూ.210 కోట్లు వచ్చాయి.

8 వారాల తర్వాత

థగ్ లైఫ్ థియేటర్లలో రిలీజ్ కాకముందే ఓటీటీ డేట్ కూడా నెట్ఫ్లిక్స్ ఖరారు చేసింది. సాధారణంగా అయితే ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. స్టార్ హీరోల సినిమాలు, బ్లాక్ బస్టర్ మూవీస్ కొన్నిసార్లు ఆలస్యంగా ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ థగ్ లైఫ్ మూవీని థియేట్రికల్ రిలీజ్ అయిన 8వ వారం తర్వాత ఓటీటీలోకి తీసుకొస్తామని నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అంటే ఆగస్టు 7న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

ఇప్పుడెలా?

నిజానికి సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా థగ్ లైఫ్ ఓటీటీ రిలీజ్ పై నెట్‌ఫ్లిక్స్‌ ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చింది. కానీ ఇప్పుడు మూవీ కలెక్షన్లు గొప్పగా ఏం లేదు. ఈ సినిమా హిట్ గా నిలవడం కష్టమే. ఈ నేపథ్యంలో 8 వారాల తర్వాత కాకుండా ముందుగానే థగ్ లైఫ్ ను ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంటే జూన్ ఫస్ట్ వీక్ లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks