...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 7 సినిమాలు.. 4 చాలా స్పెషల్.. ఒక్కోటి ఒక్కో జోనర్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా నాలుగు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 26, 2025, 05:35:13 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ సినిమాలన్నీ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, యాక్షన్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా వంటి వివిధ జోనర్స్‌లలో తెరకెక్కాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, బుక్ మై షో, సన్ నెక్ట్స్, హంగామా వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 7 సినిమాలు.. 4 చాలా స్పెషల్.. ఒక్కోటి ఒక్కో జోనర్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 7 సినిమాలు.. 4 చాలా స్పెషల్.. ఒక్కోటి ఒక్కో జోనర్.. ఇక్కడ చూసేయండి!

పింటు పింటు సుర్గా (ఇండోనేషియన్ డ్రామా చిత్రం)- జూన్ 26

రైడ్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ పొలిటికల్ డ్రామా చిత్రం)- జూన్ 26

జియో హాట్‌స్టార్ ఓటీటీ

స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ రొమాంటిక్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

బుక్ మై షో ఓటీటీ

రక్తబీజ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా మూవీ)- జూన్ 26

సన్ నెక్ట్స్ ఓటీటీ

ది వర్డిక్ట్ (తమిళ మిస్టరీ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- జూన్ 26

హంగామా ఓటీటీ

బ్యాడాస్ బేగమ్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

ఇలా ఇవాళ (జూన్ 26) ఏడు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా రక్తబీజ్, ది వర్డిక్డ్, బ్యాడాస్ బేగమ్, రైడ్ 2 నాలుగు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఈ నాలుగు ఒక్కోటి ఒక్కో జోనర్‌లో డిఫరెంట్‌గా ఉన్నాయి. అయితే, వీటిలో ఓ ఒక్కటి కూడా తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ కాకపోవడం గమనార్హం.

రైడ్ 2 గురించి

మే 1న థియేటర్లలో విడుదలైన రైడ్ 2 సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. హిందీ క్రైమ్ థ్రిల్లర్ పొలిటికల్ డ్రామా మూవీగా తెరకెక్కిన రైడ్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 243.06 కోట్లు కొల్లగొట్టి అదరగొట్టింది. నెట్ఫ్లిక్స్లో ఒకరోజు ముందుగానే రైడ్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, జూన్ 27 నుంచి రైడ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇదివరకు ప్రకటించింది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe