హై యాక్షన్ థ్రిల్లర్‌గా కట్టలన్.. విలన్‌గా కమెడియన్ సునీల్.. పోస్టర్ రిలీజ్.. మార్కో వయోలెన్స్‌కు మించి మూవీ!

మలయాళంలో మోస్ట్ వయెలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న మార్కో నిర్మాత షరీఫ్ మహమ్మద్ నుంచి హై యాక్షన్ థ్రిల్లర్ కట్టలన్ మూవీ రానుంది. ఈ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ కమెడియన్ సునీల్ నటించినునట్లు తెలుస్తోంది. కట్టలన్ నుంచి సునీల్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.

Published on: Jun 8, 2025, 12:18:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళంలో మోస్ట్ వయెలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా పేరు తెచ్చుకుంది మార్కో. ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రక్తపాతం, హింస ఎక్కువైందని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మార్కో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్, ఆహాలలో మార్కో ఓటీటీ రిలీజ్ అయింది.

హై యాక్షన్ థ్రిల్లర్‌గా కట్టలన్.. విలన్‌గా కమెడియన్ సునీల్.. పోస్టర్ రిలీజ్.. మార్కో వయోలెన్స్‌కు మించి మూవీ!
హై యాక్షన్ థ్రిల్లర్‌గా కట్టలన్.. విలన్‌గా కమెడియన్ సునీల్.. పోస్టర్ రిలీజ్.. మార్కో వయోలెన్స్‌కు మించి మూవీ!

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్

హనీఫ్ అదాని దర్శకత్వం వహించిన మార్కో సినిమాను ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ నిర్మించారు. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మార్కో విజయం తర్వాత క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత షరీఫ్ మహమ్మద్ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా కట్టలన్‌ మూవీని అనౌన్స్ చేశారు.

టాలీవుడ్ కమెడియన్

కట్టలన్ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై-యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్ (పేపే) హీరోగా నటిస్తున్న కట్టలన్ సినిమాకు పౌల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

విలన్‌గా సునీల్

కట్టలన్ మూవీలో సునీల్ విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం. దీంతో మరోసారి సునీల్ విలన్‌గా ఆకట్టుకోనున్నాడని తెలుస్తోంది. అయితే, కట్టలన్ నుంచి సునీల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సునీల్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. వెనుక భారీ వృక్షం, ముందు రెండు తుపాకులతో సునీల్ పోస్టర్ లుక్ అదిరిపోయింది.

అజనీష్ లోకనాథ్ సంగీతం

టక్ చేసి స్పెక్ట్స్ పెట్టుకున్న సునీల్ కట్టలన్ లుక్ ఇంటెన్సివ్‌గా అట్రాక్ట్ చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో సునీల్ కట్టలన్ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, కట్టలన్ సినిమాకు కాంతార 2 ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మార్కో స్థాయిలో వయోలెన్స్

కాగా, ఇప్పటికే విడుదలైన కట్టలన్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. వర్షంలో తడిచిన పేపే, చుట్టూ పడి ఉన్న మృతదేహాలు, ఏనుగు దంతాల మధ్య నిలబడి ఉండటం కథలో ఉండబోయే వయోలెన్స్ సూచిస్తోంది. మార్కో స్థాయిని మించి ఉండబోతోందని సంకేతాలు ఇస్తోంది.

ఐడెంట్ ల్యాబ్స్ డిజైన్

జైలర్, లియో, జవాన్, కూలీ లాంటి చిత్రాలకు టైటిల్ ఫాంట్స్ డిజైన్ చేసిన ఐడెంట్ ల్యాబ్స్ ఈ సినిమాకి కూడా టైటిల్ డిజైన్ చేశారు. కంటెంట్, మార్కెటింగ్ పరంగా క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నట్లు తెలుస్తోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More