...
...
Next Story

251 మంది దాతలతో హీరో కృష్ణ మానినేని రక్తదాన శిబిరం.. సింధూర సంజీవని పేరుతో కార్యక్రమం

జెట్టి సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణ మానినేని 251 మంది దాతలతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించాడు. జూన్ 14న ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సింధూర సంజీవని పేరుతో ఈ కార్యక్రమాన్ని జరిపించాడు. గత 8 ఏళ్లుగా సేవా కార్యక్రమాలతో హీరో కృష్ణ మానినేని ఆకట్టుకుంటున్నాడు.

Published on: Jun 30, 2025, 14:57:21 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్‌లో జెట్టి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మానినేని సేవా దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 100 డ్రీమ్స్ సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు.

సింధూర సంజీవనిపేరుతో

251 మంది దాతలతో హీరో కృష్ణ మానినేని రక్తదాన శిబిరం.. సింధూర సంజీవని పేరుతో కార్యక్రమం
251 మంది దాతలతో హీరో కృష్ణ మానినేని రక్తదాన శిబిరం.. సింధూర సంజీవని పేరుతో కార్యక్రమం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్అభిమానిగా విజయవాడ వరదల సమయంలో హీరో కృష్ణ మానినేని చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి. 100 డ్రీమ్స్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు కృష్ణ మానినేని జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డేను పురస్కరించుకొని "సింధూర సంజీవని" పేరిట ఇవాళ (జూన్ 30) రక్తదాన శిబిరం నిర్వహించారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంకులో

చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 251 మంది దాతలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు హీరో మానినేని కృష్ణ. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామి నాయుడు, 100 డ్రీమ్స్ వాలంటీర్స్, మెగాస్టార్-పవర్ స్టార్ అభిమానులు పాల్గొన్నారు.

2022లో వచ్చిన జెట్టీ మూవీతో

అలాగే, ఈ కార్యక్రమంలో పంచ్ ప్రసాద్, జబర్దస్త్ రాముతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేశారు. ఇదిలా ఉంటే, జెట్టి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ మానినేని. 2022లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ మానినేనికి జోడీగా హీరోయిన్ నందితా శ్వేత నటించింది.

జెట్టీ సినిమా నటీనటులు

అలాగే, జెట్టీ సినిమాలో వీళ్లిద్దరితోపాటు కిశోర్, మైమ్ గోపీ, సురభి ప్రభావతి, శివాజీ రాజా, ఎమ్ఎస్ చౌదరి, జీవా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 2022 నవంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహించారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు.

జెట్టీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్

జాలరిల జీవిత నేపథ్యంలో తెరకెక్కిన జెట్టిని యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా మలిచారు మేకర్స్. రెండు గంటల 14 నిమిషాలు ఉన్న జెట్టి సినిమాకు ఐఎమ్డీబీ నుంచి పదికి 7.9 రేటింగ్ అందుకుని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం జెట్టీ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆహాలో జెట్టీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe