Tollywood: చిరంజీవి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు.. మెగా, నందమూరి హీరోలకు గాయాల గండం.. ఆసుపత్రి పాలవుతున్న టాప్ స్టార్స్

Tollywood: టాలీవుడ్ లో మెగా, నందమూరి కుటుంబాల హీరోలు వరుస గాయాల బారిన పడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. చిరంజీవి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఆరుగురు టాప్ హీరోలు ఈ మధ్యకాలంలో గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.

Published on: Jul 28, 2026, 19:43:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tollywood: పాన్-ఇండియా రేంజ్‌లో భారీ యాక్షన్ సీన్స్ చేస్తుండటంతో టాలీవుడ్ టాప్ స్టార్లకు వరుసగా గాయాలు కావడం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేస్తోంది. ముఖ్యంగా మెగా, నందమూరి కుటుంబాలకు చెందిన నటులకే ఇలా జరుగుతుండటం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా భుజం గాయంతో 8 వారాల పూర్తి రెస్ట్‌లోకి వెళ్లగా.. ఆయనతో పాటు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, వరుణ్ తేజ్ వరుసగా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. టాలీవుడ్‌లో ఒకరి తర్వాత ఒకరు స్టార్ హీరోలు ఆసుపత్రుల పాలవుతుండటంతో మెగా, నందమూరి అభిమానులు తీవ్ర కలవరానికి గురవుతున్నారు.

Tollywood: చిరంజీవి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు.. మెగా, నందమూరి హీరోలకు గాయాల గండం.. ఆసుపత్రి పాలవుతున్న టాప్ స్టార్స్
Tollywood: చిరంజీవి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు.. మెగా, నందమూరి హీరోలకు గాయాల గండం.. ఆసుపత్రి పాలవుతున్న టాప్ స్టార్స్

డ్రాగన్ సెట్స్‌లో ఎన్టీఆర్‌కు గాయం.. 8 వారాలు షూటింగ్‌కు నో

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్‌కు అనూహ్యంగా భుజానికి తీవ్ర గాయమైంది. డాక్టర్లు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కనీసం 6 నుంచి 8 వారాల పాటు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా పూర్తి రెస్ట్ తీసుకోమని స్పష్టంగా చెప్పారు.

దీంతో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన భారీ పాన్-ఇండియా ప్రొడక్షన్ షెడ్యూల్స్ మొత్తం రీ-ప్లాన్ చేయాల్సి వచ్చింది. తారక్ కోలుకున్న తర్వాతే మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.

'పెద్ది' ఫైట్ సీన్‌లో రామ్ చరణ్‌కు..

మరోపక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా క్లైమాక్స్ కుస్తీ ఫైట్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నప్పుడు కుడిచేతి మణికట్టు కార్టిలేజ్ (మృదులాస్థి) తీవ్రంగా దెబ్బతింది. తమిళనాడులోని కోయంబత్తూర్ గంగా హాస్పిటల్‌లో విదేశీ స్పెషలిస్ట్ డాక్టర్ల నేతృత్వంలో చరణ్‌కు సక్సెస్‌ఫుల్ సర్జరీ పూర్తయింది.

గతంలో మార్చి నెలలోనే ఈ సినిమా షూట్‌లో ఆయన కంటికి కూడా చిన్న గాయమై సర్జికల్ ప్రొసీజర్ జరిగింది. ప్రస్తుతం చరణ్ పక్కనే చిరంజీవి, ఉపాసన ఉండి చూసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ రోటేటర్ కఫ్ సర్జరీ.. బాలయ్య ఎయిర్‌లిఫ్ట్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత గాయాలు తిరగబెట్టడంతో ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో మూడున్నర గంటల పాటు క్లిష్టమైన రోటేటర్ కఫ్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన కుడి భుజానికి ఆపరేషన్ పూర్తి కాగా, మరో రెండు నెలల్లో ఎడమ భుజానికి కూడా సర్జరీ చేయాల్సి ఉందని భార్య అన్నా కొణిదెల వెల్లడించారు.

ఇక గాయాల బారిన పడ్డ లిస్ట్‌లో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న NBK111 సినిమా రాజమండ్రి షెడ్యూల్‌లో ఉండగా బాలయ్య మోకాలి కండరం తీవ్రంగా చీలిపోయింది. దీంతో ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందించారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని బాబాయ్‌కి ఎన్టీఆర్ స్పెషల్ ట్వీట్ కూడా చేశారు.

మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్ పరిస్థితి ఇదీ

మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా రిలీజ్ తర్వాత ఫిబ్రవరిలో భుజానికి కీహోల్ సర్జరీ చేయించుకుని కోలుకున్నారు. అలాగే ఆయన తమ్ముడి కొడుకు వరుణ్ తేజ్ 'భారీ' సినిమా వాలీబాల్ ప్రాక్టీస్‌లో మోకాలు విరగ్గొట్టుకుని సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.

వరుణ్ రీసెంట్‌గా 'కొరియన్ కనకరాజు' ప్రమోషన్లకు చేతికర్రల సాయంతో రావడం ఫ్యాన్స్‌ని కలిచివేసింది. హీరోలే కాకుండా ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా కలకత్తా షెడ్యూల్‌లో సీనియర్ నటుడు రాజేష్ శర్మ పురుగు కుట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరారు.

రియలిస్టిక్ యాక్షన్ సీన్స్.. బడ్జెట్లతో నిర్మాతల ఆందోళన

పాన్-ఇండియా స్థాయికి తెలుగు సినిమాలు వెళ్లడంతో యాక్షన్ సీన్స్ ఇంటెన్సిటీ చాలా పెరిగిపోయింది. బాడీ డూప్స్ వాడకుండా రియలిస్టిక్ లుక్ కోసం స్టార్ హీరోలు రిస్క్ ఫైట్స్ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి.

వందల కోట్ల బడ్జెట్లతో రూపుదిద్దుకుంటున్న పాన్-ఇండియా ప్రాజెక్టుల షూటింగ్స్ ఈ గాయాల వల్ల ఆలస్యమవుతుండటంతో ప్రొడ్యూసర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హీరోలు త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టాలని సినీ లోకం ఆకాంక్షిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More