...
...
Next Story

షాక్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మృతి.. బాల‌కృష్ణ‌తో ఆ సినిమా.. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం మీమ్ అక్కడి నుంచే

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ రవి కుమార్ చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో మరణించారు. పిల్లా నువ్వులేని జీవితం, వీరభద్ర తదితర సినిమాలతో రవి కుమార్ పాపులర్ అయ్యారు.

Published on: Jun 11, 2025, 12:06:32 IST
By ,
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ లో పాపులర్ డైరెక్టర్లలో ఒకరు, హిట్ సినిమాలు అందించిన ఏఎస్ రవి కుమార్ చౌదరీ కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు రవి కుమార్ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్న రవి కుమార్ గుండెపోటుతో మరణించారు. తెలుగు సినిమా రంగంపై ఆయన తనదైన ముద్ర వేశారు. హిట్ సినిమాలతో సత్తాచాటారు.

ఆ సినిమాతో డెబ్యూ

రవి కుమార్ చౌదరి (x)
రవి కుమార్ చౌదరి (x)

ఏఎస్ రవి కుమార్ చౌదరి హీరో గోపీచంద్ సినిమాతో డైరెక్టర్ గా డెబ్యూ చేశారు. ఆ సినిమా పేరు యజ్ఞం. యజ్ఞం మూవీతో తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న రవి కుమార్.. తొలి మూవీతోనే హిట్ కొట్టారు. గోపీచంద్ కెరీర్ లోనే యజ్ఞం మూవీకి స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ సినిమాతో హీరోగా గోపీచంద్ కెరీర్ ఊపందుకుంది.

వైరల్ మీమ్

ఏఎస్ రవి కుమార్ చౌదరి బాలకృష్ణతో వీరభద్ర సినిమా చేశారు. ‘సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం’ అనే ఫేమస్ మీమ్ డైలాగ్ ఈ సినిమాలోనిదే. ఈ మీమ్ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) తో పిల్ల నువ్వు లేని జీవితం మూవీ తీశారు రవి కుమార్. ఈ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టారు సాయి ధరమ్ తేజ్. మెగా హీరోను రవి కుమార్ గ్రాండ్ గా లాంఛ్ చేశారు.

చివరగా ఆ మూవీ

గోపీచంద్ కు యజ్ఞం లాంటి హిట్ ఇచ్చిన రవి కుమార్.. మరోసారి మాచో మాన్ తో సౌఖ్యం కోసం జతకట్టారు. ఆ తర్వాత నితిన్ తో ఆటాడిస్తా సినిమా తీశారు. రవి కుమార్ చివరగా డైరెక్ట్ చేసిన మూవీ తిరగబడరా సామి. ఇందులో రాజ్ తరుణ్ హీరో. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ కు రవి కుమార్ ముద్దు పెట్టడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

ఫ్యామిలీకి దూరంగా

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe