Pradeep Rawat: తీవ్ర విషాదం.. ప్రదీప్ రావత్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ కన్ను మూసిన ‘సై’ విలన్
Pradeep Rawat: బాలీవుడ్, టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్ను మూశాడు. 74 ఏళ్ల వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ అతడు మరణించడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. సై మూవీలో భిక్షు యాదవ్ పాత్రతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
Pradeep Rawat: భారతీయ సినీ రంగాన్ని తన విలనిజంతో దశాబ్దాల పాటు భయపెట్టిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. 'గజినీ' (Ghajini) లో భయంకరమైన టైటిల్ రోల్, 'సై' (Sye) లో భిక్షు యాదవ్‌గా ఐకానిక్ విలనిజం పండించిన ఆయన 74 ఏళ్ల వయసులో ముంబైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

క్యాన్సర్ తిరగబెట్టడంతో దారుణం..
ప్రదీప్ రావత్ మేనేజర్ సిద్ధార్థ్ తివారీ ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. "ఆయన గతంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడి కోలుకున్నారు. ఇటీవల అది మళ్లీ తిరగబెట్టడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. గత నెల రోజులుగా ముంబైలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది గంటల క్రితమే కన్నుమూశారు" అని తెలిపారు.
ప్రదీప్ రావత్‌కు భార్య, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణవార్త విని ఇండస్ట్రీ షాక్‌కు గురైంది.
"మన లగాన్ దేవా ఇకలేరు".. నటుడు యశ్‌పాల్ శర్మ ఎమోషనల్ నోట్
ప్రదీప్ రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో కలిసి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు యశ్‌పాల్ శర్మ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
"'లగాన్' దేవా, మన 'గజినీ' ప్రదీప్ రావత్ ఇకలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అంటూ యశ్‌పాల్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
'మహాభారత్' అశ్వత్థామ నుంచి 'లగాన్' వరకు.. బిగ్ జర్నీ
నటుడిగా ప్రదీప్ రావత్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. బి.ఆర్.చోప్రా ఐకానిక్ టీవీ సీరియల్ 'మహాభారత్' లో అశ్వత్థామ పాత్రతో ఆయన కెరీర్ బిగ్ టర్నింగ్ పాయింట్ తీసుకుంది.
ఆ తర్వాత ఆమిర్ ఖాన్ ఆస్కార్ నామినేటెడ్ మూవీ 'లగాన్' లో దేవా పాత్రతో బాలీవుడ్‌లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు.
రాజమౌళి 'సై' సినిమాతో భిక్షు యాదవ్‌గా టాలీవుడ్ రచ్చ
తెలుగు ప్రేక్షకులకు ప్రదీప్ రావత్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన 'సై' (Sye) సినిమాలోని భిక్షు యాదవ్ పాత్ర. రగ్బీ క్రీడ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాలో ఆయన చూపించిన డెడ్‌లీ లుక్స్, నెగెటివ్ షేడ్స్ టాలీవుడ్‌లో ఒక విలనిజం బెంచ్‌మార్క్‌గా నిలిచాయి.
ఈ సినిమా తర్వాత తెలుగులో ఆయనకు విపరీతమైన ఆఫర్లు వెల్లువెత్తాయి. 'ఛత్రపతి', 'జగడం', 'భద్ర', 'లక్ష్మి', 'స్టాలిన్' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విలన్‌గా మెప్పించి సౌత్ ఇండియా వ్యాప్తంగా హ్యూజ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.
'గజినీ' మేజిక్.. ముగిసిన శకం
2008లో ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'గజినీ' లో టైటిల్ రోల్ ప్లే చేసి ప్రదీప్ రావత్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యారు. సూర్య నటించిన తమిళ ఒరిజినల్ వెర్షన్‌లో కూడా ఆయనే విలన్‌గా నటించడం విశేషం.
హిందీ, తెలుగు, తమిళంతో పాటు నేపాలీ భాషల్లో కూడా పలు సినిమాలు చేసి వర్సటైల్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అకాల మరణంతో భారతీయ చిత్రసీమ ఒక గొప్ప కల్ట్ విలన్‌ను కోల్పోయిందని టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలు నివాళులర్పిస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


