తెలుగులో 39వ వారం టాప్ 10 సీరియల్స్ ఇవే.. రేటింగ్ తగ్గినా ర్యాంకులో తగ్గేదే లేదంటున్న కార్తీకదీపం 2.. నాలుగులోనే చిన్ని

తెలుగు టీవీ సీరియల్స్ 39వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. మరోసారి స్టార్ మా సీరియల్స్ దూకుడు కొనసాగగా.. జీ తెలుగు సీరియల్స్ చివరి నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. కార్తీకదీపం 2, చిన్ని, నిండు మనసులులాంటి సీరియల్స్ దూసుకెళ్తున్నాయి.

Published on: Oct 9, 2025, 15:26:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. 39వ వారానికిగాను వీటిని రిలీజ్ చేశారు. టాప్ 10 సీరియల్స్ లో మొదటి ఆరు స్థానాల్లో స్టార్ మాకు చెందిన సీరియల్సే ఉన్నాయి. కార్తీక దీపం 2 సీరియల్ రేటింగ్ కాస్త తగ్గినా నంబర్ 1 తెలుగు సీరియల్ గా కొనసాగుతోంది.

తెలుగులో 39వ వారం టాప్ 10 సీరియల్స్ ఇవే.. రేటింగ్ తగ్గినా ర్యాంకులో తగ్గేదే లేదంటున్న కార్తీకదీపం 2.. నాలుగులోనే చిన్ని
తెలుగులో 39వ వారం టాప్ 10 సీరియల్స్ ఇవే.. రేటింగ్ తగ్గినా ర్యాంకులో తగ్గేదే లేదంటున్న కార్తీకదీపం 2.. నాలుగులోనే చిన్ని

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

39వ వారం తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగింది. టాప్ 6లో మొత్తం ఆ ఛానెల్ కు చెందినవే ఉన్నాయి. 13.45 రేటింగ్ తో కార్తీక దీపం 2 తొలి స్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు 15 దాటిన రేటింగ్ ఇప్పుడు చాలా తగ్గినా.. మిగిలిన సీరియల్స్ తో పోలిస్తే ఇంకా మెరుగ్గానే ఉంది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. దీనికి తాజాగా 13.08 రేటింగ్ నమోదైంది. మూడో స్థానంలో గుండె నిండా గుడి గంటలు కొనసాగుతోంది.

ఈ సీరియల్ కు 39వవారం 11.25 రేటింగ్ నమోదైంది. నాలుగో స్థానంలో చిన్ని సీరియల్ ఈ వారం కూడా కొనసాగింది. ఈ సీరియల్ కు తాజాగా 10.39 రేటింగ్ వచ్చింది. ఇంటింటి రామాయణం ఐదో స్థానానికి పడిపోయింది. ఈ సీరియల్ కు 10.18 రేటింగ్ ఉంది. ఇక ఈ ఏడాది జులైలో స్టార్ మాలో అడుగుపెట్టిన నిండు మనసులు సీరియల్ వరుసగా రెండో వారం కూడా టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఈసారి ఆరో స్థానానికి దూసుకొచ్చింది. ఆ సీరియల్ కు 7.64 రేటింగ్ నమోదైంది.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. టాప్ 10లో చివరి నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఈ ఛానెల్లో వచ్చే మేఘసందేశం బెస్ట్ సీరియల్ గా నిలిచింది. 7.56 రేటింగ్ తో ఓవరాల్ గా ఏడో స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత చామంతి 7.12 రేటింగ్ తో 8వ స్థానంలో ఉంది.

తర్వాతి రెండు స్థానాల్లో జగద్ధాత్రి, లక్ష్మీ నివాసం ఉన్నాయి. వీటిలో జగద్ధాత్రికి 6.95 రేటింగ్ రాగా.. 9వ స్థానంలో ఉంది. ఆ తర్వాత లక్ష్మీ నివాసం 6.92 రేటింగ్ తో పదో స్థానంలో ఉంది. జయం సీరియల్ టాప్ 10లో నుంచి వెళ్లిపోయింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More