హాఫ్ ఇయర్ రిపోర్ట్.. ఈ ఏడాది టాప్ 6 మలయాళం మూవీస్ ఇవే.. రెండు బ్లాక్‌బస్టర్లు.. ఈ ఓటీటీల్లో చూడండి.. అన్నీ తెలుగులోనే..

మలయాళం సినిమా ఈ ఏడాది కూడా సత్తా చాటింది. తొలి ఆరు నెలల్లోనే ఓ అత్యధిక వసూళ్లు మూవీ సహా రెండు బ్లాక్‌బస్టర్లు ఇచ్చింది. మరి తొలి ఆరు నెలల్లో మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాప్ 6 సినిమాలు ఏవి? వాటిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Jul 1, 2025, 10:17:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళం సినిమా రేంజ్ ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. కమర్షియల్‌గానూ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ ఏడాది అలా మోహన్‌లాల్ నటించినవే రెండు మూవీస్ ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాయి. జూన్ 30తో ఈ ఏడాది తొలి ఆరు నెలలు ముగిసింది. ఈ ఆరు నెలల్లో మలయాళం నుంచి వచ్చిన టాప్ 6 మూవీస్ ఏవో చూడండి.

హాఫ్ ఇయర్ రిపోర్ట్.. ఈ ఏడాది టాప్ 6 మలయాళం మూవీస్ ఇవే.. రెండు బ్లాక్‌బస్టర్లు.. ఈ ఓటీటీల్లో చూడండి.. అన్నీ తెలుగులోనే..
హాఫ్ ఇయర్ రిపోర్ట్.. ఈ ఏడాది టాప్ 6 మలయాళం మూవీస్ ఇవే.. రెండు బ్లాక్‌బస్టర్లు.. ఈ ఓటీటీల్లో చూడండి.. అన్నీ తెలుగులోనే..

టాప్ 6 మలయాళం మూవీస్ ఇవే

1. తుడరుమ్ - జియోహాట్‌స్టార్

మోహన్లాల్తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'తుడరుమ్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ రూ.28 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.232 కోట్లకు పైగా వసూలు చేసి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది.

కేరళలో రూ.118 కోట్లకు పైగా వసూలు చేసి.. ఆ రాష్ట్రంలో రూ.100 కోట్ల మార్క్ అందుకున్న తొలి మలయాళం మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం తెలుగులోనూ జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. ఎల్2: ఎంపురాన్ - జియోహాట్‌స్టార్

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో.. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ఎల్2: ఎంపురాన్' సంచలనం సృష్టించింది. ఇది 2019 హిట్ మూవీ 'లూసిఫర్'కు సీక్వెల్. ఇది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా చరిత్ర సృష్టించింది. కేవలం 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.262.72 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండస్ట్రీ మూవీ కూడా ఇదే. ఈ సినిమా కూడా తెలుగులో జియోహాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.

3. రేఖాచిత్రమ్ - సోనీలివ్

జోఫిన్ టి చాకో దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆసిఫ్ అలీ ఇందులో సీఐ వివేక్‌గా నటించాడు. 40 ఏళ్ల కిందట జరిగిన ఓ హత్య కేసును ఛేదించే అఫీసర్ గా అతడు కనిపించాడు. రేఖాచిత్రమ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.57.31 కోట్లు వసూలు చేసి, 2025లో మొదటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

4. ఆఫీసర్ ఆన్ డ్యూటీ - నెట్‌ఫ్లిక్స్

కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఇది కూడా ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీయే. ఓ నకిలీ గొలుసు తాకట్టు కేసు ఓ తీవ్రమైన అమ్మాయిల బ్లాక్‌మెయిల్, ఆత్మహత్యల కేసును ఎలా తెరపైకి తెస్తుంది? దానికి ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదిస్తాడన్నది ఈ మూవీ స్టోరీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.54.25 కోట్లు వసూలు చేసింది. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.

5. ఆలప్పుళ జింఖానా - సోనీలివ్

ప్రేమలు ఫేమ్ నస్లెన్ మరోసారి నవ్వులు పూయించిన మూవీ ఈ ఆలప్పుళ జింఖానా. ఖాలిద్ రెహమాన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.52.23 కోట్లు వసూలు చేసింది. కొందరు యువకులు, వాళ్ల బాక్సింగ్ కష్టాల చుట్టూ తిరిగే ఈ స్టోరీ బాగా నవ్విస్తోంది. సోనీలివ్ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది.

6. నరివెట్ట

అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో, టొవినో థామస్ లీడ్ రోల్లో నటించిన మూవీ నరివెట్ట. వయనాడ్ లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. మే 23న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా తెలుగులోనూ రిలీజైంది. అయితే ఇప్పటి వరకూ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More