...
...
Next Story

ఆహా అనిపించే థ్రిల్లర్లు.. ఆహా ఓటీటీలో ఉన్న ఈ టాప్-5 లేటెస్ట్ సస్పెన్స్ మూవీస్ చూశారా?

థ్రిల్లర్ సినిమాలకు ఉండే ఫ్యాన్ బేస్. క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ సాగే ఇలాంటి సినిమాలు ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తాయి. ఆహా ఓటీటీలో ఉన్న ఇలాంటి టాప్-5 సస్పెన్స్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.

Published on: Jun 29, 2025, 20:01:11 IST
By ,
Prefer HTon Google
Advertisement

ఓటీటీలో ఢిఫరెంట్ జోనర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో థ్రిల్లర్ మూవీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ, కను రెప్ప వేయనివ్వని మూవీస్ కూడా ఉన్నాయి. ఆహా ఓటీటీలో ఉన్న అలాంటి టాప్-5 థ్రిల్లర్లు ఇవే. అవేంటో ఇక్కడ చూసేయండి.

23

ఆహా ఓటీటీలోని టాప్ 5 థ్రిల్లర్లు (x)
ఆహా ఓటీటీలోని టాప్ 5 థ్రిల్లర్లు (x)

మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్నతో వచ్చిన మూవీ ‘23 ఇరవై మూడు’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ సస్పెన్స్థ్రిల్లర్ వచ్చింది. కులం ఆధారంగా శిక్షలు విధిస్తారనే విషయాన్ని చాటుతూ.. న్యాయం కోసం బలహీన వర్గాలు సాగించే పోరాటం నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. ఈ మూవీ అదిరిపోయిందని, కథ ఆలోచించేలా ఉందని ఎక్స్ లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

లెవన్

నవీన్ చంద్ర హీరోగా వచ్చిన ‘లెవన్’ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ ఎంగేజ్ చేస్తోంది. కవలలను టార్గెట్ చేసుకుని జరిగే సీరియల్ మర్డర్స్ వెనుకు ఉన్న హంతకుడిని పట్టుకునే కథతో లెవన్ మూవీ గ్రిప్పింగ్ గా సాగుతుంది. ఈ సినిమాలో ఏసీపీ అరవిందన్ గా నవీన్ చంద్ర యాక్టింగ్ తో అదరగొట్టాడు.

రేఖాచిత్రం

మిస్టరీ సస్పెన్స్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చింది ‘రేఖాచిత్రం’ మూవీ. ఈ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అదరగొడుతోంది. సస్పెన్షన్ నుండి తిరిగి విధుల్లోకి వచ్చిన పోలీసు అధికారి వివేక్, ఒక హత్య కేసును దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసిన రేఖ అనే యువతి హత్యకు గురైనట్లు తెలుస్తుంది. వివేక్ ఈ కేసుని విచారించే క్రమంలో చాలా కాలం క్రితం జరిగిన ఒక హత్య కేసుతో సంబంధం ఉందని తెలుసుకుంటాడు. వివేక్ ఈ కేసుని ఎలా ఛేదించాడు, రేఖ హత్య వెనుక ఉన్న నిజాలు ఏమిటి అనేది ఈ సినిమా కథ.

వడక్కన్

జబర్దస్త్ షోతో ఫేమ్ తెచ్చుకున్న అదిరే అభి లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన మూవీ ‘ది డెవిల్స్ చెయిర్’. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో మంచి సందేశం కూడా ఉంది. దురాశ దు:ఖానికి చేటు అని చాటుతుంది ఈ సినిమా. అప్పుల పాలై, ఉద్యోగం కోల్పోయిన ఓ యువకుడిగా మిస్టరీ చెయిర్ లో ఉన్న ఆత్మ డబ్బులు పొందే మార్గాలు చెబుతుంది. మరి ఆ చెయిర్ లో ఉన్నది ఎవరు? చివరకు ఏం జరిగిందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe