This Week Top OTT: ఈ వారం ఓటీటీ మోత.. మిస్సవ్వకూడని టాప్ సినిమాలివే.. రొమాన్స్ నుంచి థ్రిల్ వరకు.. క్రేజీ రిలీజ్ లు!

This Week Top OTT Releases: ఈ వారం ఓటీటీలో ఎంటర్ టైన్మెంట్ మోత మోగనుంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాలు, సిరీస్ ల లిస్ట్ మామూలుగా లేదు. రొమాన్స్ నుంచి థ్రిల్ వరకూ ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే పండగ. మరి ఈ వారం ఓటీటీలో మిస్సవ్వకుండా చూడాల్సిన టాప్ సినిమాలేవో ఓ లుక్కేయండి.

Published on: Oct 5, 2026, 14:28:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

This Week Top OTT Releases: అక్టోబర్ రెండో వారంలో డిజిటల్ ప్రియులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌‌లు అదిరిపోయే వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్, సోనీ లివ్ వేదికగా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు, కామెడీ, హాలీవుడ్ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. థియేటర్లలో రూ.150 కోట్లు కొల్లగొట్టిన 'మండాడి' నుంచి హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వరకు ఈ వారం రిలీజ్ కానున్న మస్ట్ వాచ్ సినిమాలు, సిరీస్‌ల పూర్తి వివరాలు మీకోసం.

ఈ వారం ఓటీటీ మోత.. మిస్సవ్వకూడని టాప్ సినిమాలివే.. రొమాన్స్ నుంచి థ్రిల్ వరకు.. క్రేజీ రిలీజ్ లు!
ఈ వారం ఓటీటీ మోత.. మిస్సవ్వకూడని టాప్ సినిమాలివే.. రొమాన్స్ నుంచి థ్రిల్ వరకు.. క్రేజీ రిలీజ్ లు!

​మండాడి (Mandaadi)

థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ ఇది. కామెడీ రోల్స్ నుంచి మాస్ హీరోగా మారిన సూరి, విలనిజంలో వైవిధ్యం చూపించిన టాలీవుడ్ నటుడు సుహాస్ మధ్య సాగే పడవల పోటీ నేపథ్యంలో వచ్చే ఈగో వార్ మైండ్ బ్లాక్ చేస్తుంది. స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడేవారు అస్సలు మిస్ కావద్దు!

  • అక్టోబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో మండాడి స్ట్రీమింగ్ కానుంది.

​ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (Pradhama Drishtya Kuttakkar)

కేరళ బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకున్న సీరియస్ కాప్ డ్రామా ఇది. ఒక పోలీస్ కేసు దర్యాప్తులో ఎదురయ్యే ఊహించని మలుపులు, పార్వతి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. మలయాళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ల అభిమానులకు ఇది పర్ఫెక్ట్ వాచ్.

  • అక్టోబర్ 9 నుంచి ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ పోలీస్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో అందుబాటులోకి రానుంది.

​రిపోర్టింగ్ లైవ్ (Reporting Live)

అక్రమ ఇసుక మైనింగ్, పొలిటికల్ మాఫియా నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ డ్రామా. జర్నలిస్టుగా పరిణీతి చోప్రా నిజాన్ని బయటపెట్టేందుకు ప్రాణాలకు తెగించి చేసే పోరాటం థ్రిల్ కలిగిస్తుంది. ధృవ్ త్రిపాఠి దర్శకత్వంలో వస్తున్న ఈ థ్రిల్లర్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

  • అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ (తెలుగు సబ్‌టైటిల్స్)లో స్ట్రీమింగ్ అవుతుంది.

​లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Least Eligible Bachelor)

పెళ్లికాక ఇబ్బందిపడే ఒక సగటు యువకుడి జీవితంలో జరిగే సరదా సంఘటనల సమాహారమే ఈ సిరీస్. వైవా హర్ష కామెడీ టైమింగ్, బాబు డేగాల మేకింగ్ కలిసి ఈ సీరియస్‌ని పక్కా నవ్వుల పండగగా మార్చనున్నాయి. ప్యూర్ తెలుగు కంటెంట్ కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్.

  • అక్టోబర్ 9 నుంచి ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ ఈటీవీ విన్ (ETV Win)లో చూడొచ్చు.

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man: Brand New Day)

హాలీవుడ్ సూపర్ హీరో లవర్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తున్న బిగ్గెస్ట్ మూవీ ఇది. అక్టోబర్ 6 నుంచే రెంటల్ (Store Rental) పద్ధతిలో భారతీయ వీక్షకులకు తెలుగు ఆడియోతో సహా అందుబాటులో ఉండనుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.20 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

  • అక్టోబర్ 6 న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video India) ఓటీటీలో రెంటల్ మోడ్ లో ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీలో డెబ్యూ చేస్తుంది.
  • ​జానర్: సూపర్ హీరో యాక్షన్ / అడ్వెంచర్

ఎపిక్ (EPIC)

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ఎపిక్. ఈ మూవీ కూడా అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ కానుంది.

ఇక మలయాళం సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఐస్ కూడా ఈ వారం టాప్ ఓటీటీ రిలీజ్ లో ఒకటి. ఇది సోనీ లీవ్ లో అక్టోబర్ 9న అడుగుపెట్టనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More