ఓటీటీలో అదరగొడుతున్న చిన్న సినిమా.. తుడరుమ్ ను దాటి ట్రెండింగ్.. ఓ లుక్కేయండి
రివేంజ్ థ్రిల్లర్ గా థియేటర్లకు వచ్చిన తుడరుమ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలోని ఆ మూవీ దుమ్మురేపుతోంది. అయితే అనూహ్యంగా తుడరుమ్ ను దాటి ఇప్పుడు ఓ చిన్న సినిమా ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది.
ఓటీటీలో ఓ చిన్న సినిమా అదరగొడుతోంది. థియేటర్లను షేక్ చేసిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. రివేంజ్ థ్రిల్లర్ తుడరుమ్ ను వెనక్కినెట్టి ఈ ఫ్యామిలీ మూవీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆ సినిమానే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఈ చిన్న సినిమా ఇప్పుడు పెద్ద టాపిక్ గా మారింది. ఓటీటీని ఏలుతోంది.

అంచనాలు లేకుండా
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు సైలెంట్ గా వచ్చింది. కానీ ఆ తర్వాత కలెక్షన్లతో అదరగొట్టింది. రూ.8 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ మూవీ.. సుమారు రూ.87.87 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మే 1న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమా పెను ప్రకంపనలే సృష్టించింది. రాజమౌళి, రజనీకాంత్ లాంటి దిగ్గజాలు ఈ మూవీని ప్రశంసించకుండా ఉండలేకపోయారు.
ఓటీటీలోనూ అదే జోరు
థియేటర్లను షేక్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జూన్ 2న ఓటీటీలోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇప్పుడు థ్రిల్లర్ తుడరుమ్ ను వెనక్కినెట్టేసింది. జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ తో అదరగొడుతోంది.
ఆ భాషల్లో ట్రెండింగ్
తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలోకి వచ్చింది టూరిస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడుజియోహాట్స్టార్ఇండియాలో ఓవరాల్ గా టాప్ 1 ప్లేస్ లో నిలిచింది. తెలుగులోనూ ఈ మూవీ టాప్ లోనే ట్రెండింగ్ అవుతోంది. తుడరుమ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. తమిళం, కన్నడలోనూ టూరిస్ట్ ఫ్యామిలీ ట్రెండింగ్ నంబర్ వన్ గా ఉంది. తుడరుమ్ ను దాటేసింది. మలయాళంలో మాత్రం తుడరుమ్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది. హిందీలో టాప్-6లో ట్రెండ్ అవుతోంది.
కథ ఏమిటంటే?
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో శశి కుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించారు. ధర్మదాస్, వసంతి అనే పాత్రల్లో వీళ్లు కనిపించారు. శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన వీళ్లు అక్కడి సంక్షోభ పరిస్థితులను తట్టుకోలేక అక్రమంగా ఓ బోటు ద్వారా ఇండియాలోకి అడుగుపెడతారు. ఈలం తమిళ కుటుంబమైన వీళ్లు తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న వసంతి అన్న ప్రకాశ్ (యోగి బాబు) సాయంతో ఇక్కడ బతుకుతెరువు కోసం వస్తారు.
ఇక్కడికి రాగానే పోలీసులు వాళ్లను పట్టుకున్నా.. ధర్మదాస్, వసంతి చిన్న కొడుకు మురళి (కమలేష్ జగన్) తెలివితేటలతో వాళ్ల నుంచి తప్పించుకుంటారు. తర్వాత వాళ్లు కేశవ నగర్ అనే కాలనీలోకి వెళ్తారు. ఓ పోలీసు ఇంట్లోనే భయంభయంగా అద్దెకు దిగుతారు. అయితే తాము ఎన్ని కష్టాల్లో ఉన్నా.. బయటకు నవ్వుతూ, అందరితోనూ కలుపుగోలుగా ఉండే ఆ కుటుంబం కొన్ని రోజుల్లోనే ఆ కాలనీ వాసులకు దగ్గరవుతుంది.
ఈలోపు రామేశ్వరంలోనే ఓ బాంబు పేలుడు జరగడం, దానికి ఈ అక్రమంగా వలస వచ్చిన శ్రీలంక కుటుంబమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి? ఈ విపత్తు నుంచి వాళ్లు బయటపడతారా? చివరికి ఆ శరణార్థి కుటుంబం ఏం కానుంది అన్నది ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో చూడొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper













