తెలుగులోకి టొవినో థామస్ లేటెస్ట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?
టొవినో థామస్ హీరోగా నటించిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ నరివెట్టి తెలుగులోకి రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. ఇటీవల మలయాళంలో రిలీజైన ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది.
టొవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ నరివెట్ట తెలుగులోకి వస్తోంది. థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో విడుదలచేస్తోంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఆ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. రిలీజ్ డేట్‌ను మాత్రం రివీల్ చేయలేదు. జూన్ ఫస్ట్ వీక్‌లో నరివెట్ట మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పాజిటివ్ టాక్...
ఇటీవల మలయాళంలో థియేటర్లలో రిలీజైన నరివెట్ట మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. పదిహేను కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ రిలీజైంది. ఆరు రోజుల్లో పది కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్‌లోనే మూవీ బ్రేక్ ఈవెన్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
ముతంగ ఘటన ఆధారంగా...
నరివెట్ట మూవీలో సూరజ్ వెంజరమూడు, చేరన్ ప్రధాన పాత్రలు పోషించారు. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించాడు. 2003లో జరిగిన ముతంగ ఘటన ఆధారంగా నరివెట్ట మూవీని రూపొందించాడు దర్శకుడు. రాజకీయ ఒత్తిడుల కారణంగా వృత్తి నిర్వహణలో పోలీసులు ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంటారన్నది ఈ మూవీలో థ్రిల్లింగ్‌గా చూపించాడు డైరెక్టర్.
వర్గీస్ పోరాటం...
వర్గీస్ నిజాయితీతో పాటు ఆవేశం, మొండితనం ఎక్కువ. తన మనస్తత్వం కారణంగా ఏ ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగలేకపోతాడు. నాన్సీని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వర్గీస్‌ను వదిలిపెట్టి వెళ్లిపోతుంది. ఇష్టంలేకపోయినా సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ జాబ్‌లో జాయిన్ అవుతాడు వర్గీస్. బషీర్ అహ్మద్ అనే ఆఫీసర్ కింద పనిచేయడం మొదలుపెడతాడు.
పోడు భూములకు తమకు అప్పగించాలంటూ ఆదివాసీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటారు. ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీసులను, సీఆర్‌పీఎఫ్ టీమ్‌ను ప్రభుత్వం అక్కడి పంపిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ప్రభుత్వానికి, ఆదివాసీలకు జరిగిన యుద్ధంలో వర్గీస్ ఎవరిపై నిలబడ్డాడు అన్నదే ఈ మూవీ కథ.
ఎల్2 ఎంపురాన్‌లో...
కానిస్టేబుల్ పాత్రలో టొవినో థామస్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ కంటే ముందు ఐడెంటిటీ, ఏఆర్ఎమ్ సినిమాలు చేశాడు టొవినో థామస్. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ ఎల్2 ఎంపురాన్‌లో ఓ కీలక పాత్రలో నటించాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ మూవీస్ చేస్తోన్నాడు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper












