Trisha Krishnan: మీ బట్టలు కంపు కొడుతున్నాయి.. డెలివరీకి ముందు చూసుకోరా?: టాప్ బ్రాండ్ పరువు తీసిన త్రిష.. ఏం జరిగింది?

Trisha Krishnan: త్రిష కృష్ణన్ ఓ టాప్ బట్టల బ్రాండ్ పరువు తీసింది. వాళ్లు డెలివరీ చేస్తున్న బట్టల నుంచి ఏదో కంపు వస్తుందంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

Published on: Jul 3, 2026, 20:57:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష ఆన్‌లైన్ షాపింగ్ చేసి తీవ్ర నిరాశకు గురైంది. ఏకంగా ఇంటర్నేషనల్ బ్రాండ్ జారా (Zara) పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫైర్ అవ్వడం ఇప్పుడు కోలీవుడ్ టు టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. ఏమాత్రం మొహమాటం లేకుండా ఆ బ్రాండ్ బండారాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టింది మన సౌత్ క్వీన్.

Trisha Krishnan: మీ బట్టలు కంపు కొడుతున్నాయి.. డెలివరీకి ముందు చూసుకోరా?: టాప్ బ్రాండ్ పరువు తీసిన త్రిష.. ఏం జరిగింది?
Trisha Krishnan: మీ బట్టలు కంపు కొడుతున్నాయి.. డెలివరీకి ముందు చూసుకోరా?: టాప్ బ్రాండ్ పరువు తీసిన త్రిష.. ఏం జరిగింది?

వరుసగా మూడుసార్లు చెమట కంపు కొడుతున్న బట్టలు డెలివరీ చేశారంటూ జారా బ్రాండ్‌పై త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హోమ్ డెలివరీ చేసేటప్పుడు కనీసం ప్యాక్ చేసే ముందైనా స్మెల్ చూడండి అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో ఘాటుగా కౌంటర్ వేసింది. ఇంత పెద్ద బ్రాండ్ నుంచి ఇలాంటి 'దారుణమైన' అనుభవం ఎదురవ్వడంతో ఆమె ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.

ట్రోల్ అవుతున్న జారా బ్రాండ్..

జారా లాంటి ప్రీమియం బ్రాండ్‌కు ఇండియాలో లక్షలాది మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. త్రిషలాంటి ఒక స్టార్ సెలబ్రిటీ నేరుగా ఇలాంటి ఫిర్యాదు చేయడంతో నెటిజన్లు కూడా తమ షాపింగ్ అనుభవాలను షేర్ చేస్తూ జారాను ఆడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఇష్యూ పై సదరు బ్రాండ్ అధికారికంగా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.

ఇదే క్రమంలో పెరిమెనోపాజ్ (perimenopause) గురించి త్రిష పెట్టిన మరో పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. ఈ ఏజ్‌లో ఇతరులను మెప్పించాలనే హార్మోన్స్ తగ్గిపోయి, ఎవరి గురించి పట్టించుకోని (IDGAF) ఆటిట్యూడ్ వస్తుందంటూ ఒక డాక్టర్ చెప్పిన కోట్‌ను ఆమె షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు 'ఫ్యాక్ట్' అంటూ త్రిష అంగీకరించడం చూస్తుంటే, ఇప్పుడు ఆమె మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈజీగా అర్థమవుతోంది.

సీఎం విజయ్ తో ప్రేమాయణం.. నెట్టింట రచ్చ

ఇక త్రిష పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్‌తో ఆమె రిలేషన్ షిప్ రూమర్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ బర్త్ డే రోజున "నా జీవితానికి అర్థం చెప్పిన వ్యక్తికి హ్యాపీ బర్త్ డే" అంటూ ఆమె పోస్ట్ చేసిన రొమాంటిక్ పిక్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిడ్ నైట్ విజయ్ తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నట్లు ఆ ఫోటోలోని కేక్స్ ను బట్టి ఫ్యాన్స్ డీకోడ్ చేశారు.

గత ఫిబ్రవరిలో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మార్చిలో జరిగిన ఒక పెళ్లికి విజయ్, త్రిష మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ లో కలిసి వెళ్లడం ఈ రూమర్స్ కు మరింత బలం చేకూర్చింది. ఒకప్పుడు 'గిల్లి', 'తిరుప్పాచి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఈ పెయిర్.. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఒక్కటి కాబోతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

కరుప్పు బాక్సాఫీస్ విధ్వంసం

ఇటీవలే 43వ పడిలోకి అడుగుపెట్టిన త్రిష.. తన తల్లి ఉమా గణపతి 70వ పుట్టినరోజును కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఇక కెరీర్ పరంగా చూస్తే, సూర్యతో కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'కరుప్పు' (Karuppu) బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది.

ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా త్రిషకు ఒక పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. చాలా గ్యాప్ తర్వాత సూర్య, త్రిష కాంబో స్క్రీన్ మీద మ్యాజిక్ చేయడంతో థియేటర్లలో కలెక్షన్స్ వర్షం కురిసింది. ఓ వైపు బ్లాక్ బస్టర్ హిట్స్, మరోవైపు బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో త్రిష కెరీర్ ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతోంది.

త్రిష ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన పోస్ట్
త్రిష ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన పోస్ట్
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More