ఉరుములు నీ మువ్వలై సాంగ్ లిరిక్స్.. చంద్రలేఖలోని ఈ ఎవర్‌గ్రీన్ సాంగ్ మీకు గుర్తుందా? సందీప్ చౌతా సూపర్ మెలోడీ

ఉరుములు నీ మువ్వలై సాంగ్ మీకు గుర్తుందా? నాగార్జున, రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో నటించిన చంద్రలేఖ సినిమాలో సందీప్ చౌతా అందించిన సూపర్ మెలోడీ ఇది. 27 ఏళ్లవుతున్నా.. ఈ పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

Published on: Jun 16, 2025, 18:29:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్ని పాటలు కాలాతీతం. ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తూనే ఉంటుంది. అలాంటిదే చంద్రలేఖ మూవీలోని ఉరుములు నీ మువ్వలై పాట కూడా. ఎప్పుడో 1998లో వచ్చిన చంద్రలేఖ మూవీలోని సాంగ్ ఇది. ఈ పాటలోని మెలోడీ మన మనసుల్ని తాకుతుంది. కాలంలో మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది.

ఉరుములు నీ మువ్వలై సాంగ్ లిరిక్స్.. చంద్రలేఖలోని ఈ ఎవర్‌గ్రీన్ సాంగ్ మీకు గుర్తుందా? సందీప్ చౌతా సూపర్ మెలోడీ
ఉరుములు నీ మువ్వలై సాంగ్ లిరిక్స్.. చంద్రలేఖలోని ఈ ఎవర్‌గ్రీన్ సాంగ్ మీకు గుర్తుందా? సందీప్ చౌతా సూపర్ మెలోడీ

ఉరుములు నీ మువ్వలై సాంగ్ గురించి..

తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా పని చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ వాటితోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాడు. నిన్నే పెళ్లాడుతా అయినా, చంద్రలేఖ అయినా.. అతని మెలోడీ మనపై తిరుగులేని ముద్ర వేసింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో 1998లో వచ్చిన చంద్రలేఖలోని ఈ ఉరుములు నీ మువ్వలై పాట కూడా అలాంటిదే.

రాజేష్, సుజాత వాయిస్ ఈ పాటను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. సినిమా మొత్తం ఒకెత్తయితే ఈ సాంగ్ మరో ఎత్తు. నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్, మురళీమోహన్, చంద్రమోహన్, గిరిబాబు.. ఇలా సినిమాలోని ముఖ్యమైన పాత్రలన్నీ ఇందులో కనిపిస్తాయి. మరి అలాంటి సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.. మీరూ పాడుతూ మరోసారి ఆ కాలానికి వెళ్లండి.

ఉరుములు నీ మువ్వలై సాంగ్ లిరిక్స్

పల్లవి

ఉరుములు నీ మువ్వలై

మెరుపులు నీ నవ్వులై

తొలకరి మేఘానివై రా అలివేణి

పరుగులు నీ గానమై

తరగలు నీ తాళమై

చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

కాలానికే కాలాడక.. ఆగాలి నువ్వు ఆడే వేళ

అది చూడగా.. మనసాగక.. ఆడాలి నీతో నింగినేల

తకదిమి తాళాలపై తళుకుల తరంగమై

చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

మెళికల మందాకిని.. కులుకుల బృందావని

కనులకు విందీయవే ఆ అందాన్ని..

చరణం 1

చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ

మురిసింది ఈ ముంగిలి

చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే

ప్రతి పూట దీపావళి

మా కళ్లల్లో వెలిగించవే సిరివెన్నెల..

మా ఆశలే నీ అందెలై

ఈ మంచు మౌనం మోగేవేళ

ఆ సందడే ఆనందమై

ప్రేమించు ప్రాణం పాడేవేళ

ఉరుములు నీ మువ్వలై

మెరుపులు నీ నవ్వులై

తొలకరి మేఘానివై రా కళ్యాణి

తకదిమి తాళాలపై తళుకుల తరంగమై

చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

చరణం 2

నడయాడే నీ పాదం నటవేదమేనంటూ

ఈ పుడమే పులకించగా

నీ పెదవే తన కోసం అనువైన కొలువంటు

సంగీతం నిను చేరగా

మా గుండెనే శ్రుతి చేయవా.. నీ వీణలా….

ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో వేగేవేళ

నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగై సాగేవేళ

ఉరుములు నీ మువ్వలై

మెరుపులు నీ నవ్వులై

తొలకరి మేఘానివై రా అలివేణి

తకదిమి తాళాలపై తళుకుల తరంగమై

చిలిపిగ చిందాడవే మ్..మ్..మ్..మ్…

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More