...
...
Next Story

ఓటీటీలోకి నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ సిరీస్‍లో వాణి కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. డిటెక్టివ్‍గా నటించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది.

Published on: Jun 30, 2025, 13:08:48 IST
By
Prefer HTon Google
Advertisement

ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ జానర్లో సిరీస్‍లు వస్తూనే ఉంటాయి. సస్పెన్స్, ట్విస్టులు, ఉత్కంఠతో ఉండటంతో ఇలాంటి సిరీస్‍లకు ఎక్కువ ఆదరణ దక్కుతుంటుంది. ఈ క్రమంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో 'మండాలా మర్డర్స్' అనే నయా వెబ్ సిరీస్ వస్తోంది. బాలీవుడ్ స్టార్ నటి వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్తా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది. ఓ పోస్టర్ వచ్చేసింది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

మండాలా మర్డర్స్: ఓటీటీలోకి నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మండాలా మర్డర్స్: ఓటీటీలోకి నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్ జూలై 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్నిఆ ప్లాట్‍ఫామ్ నేడు (జూన్ 30) అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది నెట్ఫ్లిక్స్. ఈ పోస్టర్లో వాణి కపూర్ గన్ పట్టుకొని ఉన్నారు. వైభవ్, శ్రీయా పింయోన్కర్, సువేన్ చావ్లా కూడా పోస్టర్లో ఉన్నారు.

మరణాల మిస్టరీ చుట్టూ..

మండాలా మర్డర్స్ సిరీస్‍‌కు గోపీ పుత్రన్ క్రియేటర్‌గా ఉన్నారు. చరణ్‍‌దాస్ పూర్ అనే ఊర్లో వరుసగా సంభవించే మరణాల వెనుక మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ కేసులను దర్యాప్తు చేసే డిటెక్టివ్‌ల పాత్రలను వాణి కపూర్, వైభవ్ రాజ్ చేశారు. సువీన్ చావ్లా ఈ సిరీస్‍‌లో నెగెటివ్ రోల్‍‌లో నటిస్తున్నారు. హత్యల వెనుక ఉన్న రహస్యాలు, మూఢ నమ్మకాలు, కుట్రలతో ఈ స్టోరీ ఉంటుందని అర్థమవుతోంది. సూపర్ నేచురల్, హారర్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నాయి.

మండాలా మర్డర్స్ సిరీస్‍‌ను యశ్ రాజ్ ఫిల్మ్ ఎంటర్‌టైన్‌‍మెంట్స్ పతాకంపై ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధానీ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. సందీప్ యాదవ్.. సినిమాటోగ్రఫీ చేశారు.

నెట్‌‍ఫ్లిక్స్‌లో అదరగొడుతున్న రైడ్ 2

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe