ఒకే రోజు రెండు ఓటీటీల‌లోకి వ‌చ్చిన మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ -ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌ -నెవ‌ర్ బిఫోర్ క్లైమాక్స్

మ‌ల‌యాళం హార‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ వ‌డ‌క్క‌న్ ఒకే రోజు రెండు ఓటీటీల‌లోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్‌తో సైనా ప్లే ఓటీటీల‌లో ఈ మూవీ రిలీజైంది. కాంతార కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

Published on: Apr 30, 2025, 10:05:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మ‌ల‌యాళం హార‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ వ‌డ‌క్క‌న్ ఒకే రోజు రెండు ఓటీటీల‌లోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్‌తో పాటు సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఈ మ‌ల‌యాళం మూవీలో కాంతార కిషోర్ తో పాటు శృతి మీన‌న్‌, మెర్లిన్ ఫిలిప్‌, మీనాక్షి ఉన్ని కృష్ణ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

వడక్కన్ మూవీ
వడక్కన్ మూవీ

సౌండ్ డిజైన‌ర్‌...

సాజీద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మ‌ల‌యాళం మూవీకి ఆస్కార్ విన్న‌ర్ ర‌సూల్ పొకుట్టి సౌండ్ డిజైన‌ర్‌గా ప‌నిచేశాడు. బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫ‌ర్ కైకో న‌కారా కెమెరామెన్‌గా ప‌నిచేసింది. మార్చి ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన వ‌డ‌క్క‌న్ మూవీ టెక్నిక‌ల్‌గా మంచి మూవీగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

సౌండ్ డిజైనింగ్‌, విజువ‌ల్స్ ప‌రంగా మలయాళంలో వ‌చ్చిన బెస్ట్ హార‌ర్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది.

ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

అడ‌విలో అన్వేష‌ణ‌...

రామ్ (కిషోర్‌) వ‌ర‌ల్డ్‌లోనే నంబ‌ర్ వ‌న్ పారా నార్మ‌ల్ సైక‌లాజిస్ట్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఓ రోజు మాజీ ప్రియురాలు మేఘా రామ్‌కు ఫోన్ చేస్తుంది. రియాలిటీ షో షూటింగ్ కోసం అడ‌వికి వెళ్లిన త‌న భ‌ర్త‌తో పాటు అత‌డి స్నేహితులు క‌నిపించ‌కుండా పోయార‌ని, వారికి ఏమైందో క‌నిపెట్ట‌డంతో త‌న‌కు సాయం చేయ‌మ‌ని రామ్‌ను మేఘా అడుగుతుంది.

మేఘా భ‌ర్త కోసం అన్వేషిస్తూ అడ‌విలోని పాత‌కాలం నాటి ఇంట్లో అడుగుపెట్టిన రామ్‌, మేఘాల‌కు అక్క‌డ ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? నాలుగు వంద‌ల ఏళ్లుగా ఎవ‌రూ అడుగుపెట్ట‌ని ఆ ఐలాండ్‌ మిస్ట‌రీని రామ్ ఎలా ఛేదించాడు? మేఘా భ‌ర్త‌తో పాటు అత‌డి స్నేహితులు క‌నిపించ‌కుండా పోవ‌టానికి కార‌ణం ఏమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

నెవ‌ర్ బిఫోర్‌...

టెక్నిక‌ల్‌గా బాగున్నా తాను అనుకున్న క‌థ‌ను చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు క‌న్ఫ్యూజ్ అయ్యాడ‌నే విమ‌ర్శ‌లొచ్చాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నెవ‌ర్ బిఫోర్ అంటూ ఆడియెన్స్ కామెంట్స్ వ‌చ్చాయి. ఈ మూవీకి బిజిబాల్ అందించిన మ్యూజిక్ ప్ల‌స్స‌య్యింది.

తెలుగులో...

క‌న్న‌డ న‌టుడు అయిన కిషోర్ తెలుగులోనూ ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు చేశాడు. అల్లు అర్జున్ హ్యాపీ మూవీతో విల‌న్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు కిషోర్‌. కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్‌, కార్తికేయ‌, పీఎస్‌వీ గుర‌డ‌వేగ‌, ఆచార్య‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో విల‌న్‌గా, స‌హాయ న‌టుడిగా క‌నిపించాడు. తెలుగు, క‌న్న‌డంలోనే కాకుండా మ‌ల‌యాళం, త‌మిళం, హిందీ భాష‌ల్లో ప‌లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేశాడు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More