వెంకీ అట్లూరి-సూర్య సినిమా షురూ.. ఫ్యామిలీ డ్రామాగా మూవీ!
రెట్రో మూవీ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య మరో సినిమా కోసం రంగంలోకి దిగాడు. ఈ సారి తెలుగు డైరెక్టర్ తో జత కట్టాడు. వెంకీ అట్లూరి, సూర్య కాంబినేషన్ లో ఫిల్మ్ షూటింగ్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది.
తమిళ సూపర్ స్టార్ సూర్య కొత్త మూవీ అఫీషియల్ గా లాంఛ్ అయింది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య 46 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మేరకు మేకర్స్ బుధవారం (జూన్ 11) సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ గా అవుతోంది.

సెలబ్రేషన్స్ షురూ
సూర్య-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో కొత్త మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సూర్య నడుచుకుంటూ వెళ్తున్న ఫోజులో ఉన్నారు. ఈ పోస్టర్ పై ‘‘అండ్ సెలబ్రేషన్ బిగిన్స్ (ఇక సంబరాలు షురూ)’’ అని రాసుకొచ్చారు. ‘‘సెలబ్రేషన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ దిశగా తొలి అడుగు’’ అని ఆ పోస్టుకు క్యాప్షన్ యాడ్ చేశారు.
ఎమోషనల్ డ్రామాగా
రెట్రో మూవీ సూర్యకు మిక్స్ డ్ రిజల్ట్ అందించింది. తమిళంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ అదరగొట్టింది. కానీ తెలుగులో మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇప్పుడు కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలనే టార్గెట్ తో సూర్య పక్కా ప్లాన్ తో బరిలో దిగుతున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమాకు సై అన్నాడు. సూర్య 46 మూవీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది.
జోరుగా షూటింగ్
సూర్య 46 సినిమా షూటింగ్ ఇక జోరుగా సాగనుంది. ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు కీలక రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ జాయింట్ గా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్స్. ఈ ఫిల్మ్ కు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్.
ఆ హీరోలతో
తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి వరుసగా ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తెలుగులో తొలి ప్రేమ సినిమాతో డైరెక్టర్ గా మారిన వెంకీ.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు చేశారు. ఆ తర్వాత ధనుష్ తో వాతి (తెలుగులో సార్) సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ వెంటనే దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు సూర్యతో మూవీని పట్టాలెక్కించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



