ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు.. ఆరేడు సినిమాలను నిర్మిస్తున్నాను.. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కామెంట్స్

బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. హీరోగా, సంగీత దర్శకుడిగా విజయ్ ఆంటోనీ అందిస్తున్న సినిమా మార్గన్. జూన్ 26న నిర్వహించిన మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Jun 27, 2025, 06:44:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంగీత దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా ఎదిగాడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడుసినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ అందుకున్నాడు. అలాగే, బిచ్చగాడు 2 సినిమాతో కూడా బాగా అలరించాడు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతూన్న విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్.

ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు.. ఆరేడు సినిమాలను నిర్మిస్తున్నాను.. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కామెంట్స్
ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు.. ఆరేడు సినిమాలను నిర్మిస్తున్నాను.. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కామెంట్స్

జూన్ 27న సురేష్ బాబుతో రిలీజ్

విజయ్ ఆంటోని నటించి నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మించారు. సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సమర్పించారు. మార్గన్ సినిమాను జూన్ 27న తెలుగు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్

ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అయిన మార్గన్ టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా జూన్ 26న మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ అనే ఓ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.

మా మొదటి సక్సెస్ ఇదే

విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ .. "మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి చాలా ధన్యవాదాలు. ఆయన చాలా గొప్ప నిర్మాత. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాను. ఆయన మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా మొదటి సక్సెస్" అని అన్నాడు.

చాలా లేయర్లు ఉంటాయి

"లియో జాన్ పాల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు. ఇందులో చాలా లేయర్లు ఉంటాయి. నేను కంటెంట్ గురించి ఎక్కువ మాట్లాడితే కథ రివీల్ అవుద్ది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంగేజింగ్‌గా ఉంటుంది" అని విజయ్ ఆంటోనీ తెలిపాడు.

తెలుగు, తమిళంలో

"నేను ఈ సినిమాకు సంగీతాన్ని అందించాను. భద్రకాళి, లాయర్ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాను. నేను ప్రస్తుతం ఆరేడు సినిమాల్ని నిర్మిస్తున్నాను. మా ‘మార్గన్’ ప్రస్తుతం తమిళ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాను" అని బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చాడు.

నటుడిగా పరిచయం చేస్తున్నా

"మా సిస్టర్ సన్ అజయ్ ధీషన్ బిచ్చగాడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అతడ్ని ఈ మార్గన్ చిత్రంతో నటుడిగా పరిచయం చేస్తున్నాను. భాష్యశ్రీ గారి పాటలు, మాటల వల్ల ఇది పూర్తి తెలుగు సినిమాగా అనిపిస్తోంది. బ్రిగిడ, దీప్శిఖ గొప్పగా నటించారు. జూన్ 27న రాబోతోన్న మా మార్గన్ సినిమాను అందరూ చూడండి" అని విజయ్ ఆంటోనీ కోరారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More