13 ఏళ్ల క్రితం పొద్దున లేచి ఆ వెబ్‌సైట్ చూసేవాడిని.. హీరో విజయ్ దేవరకొండ కామెంట్స్
టాలీవుడ్‌లో రౌడీ హీరోగా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం కింగ్‌డమ్ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ నిర్మాత దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్‌ను లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్‌కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచనే ఈ దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్‌ని లాంచ్ చేస్తున్నాం' అన్నారు నిర్మాత దిల్ రాజు.

దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్
ఇటీవల దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరై దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్‌ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. 13 ఏళ్ల క్రితం పొద్దున లేచిన వెంటనే ఐడియల్ బ్రెయిన్ డాట్ కామ్ (idlebrain.com) అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి చూసేవాడిని. ఎక్కడైనా కాస్టింగ్ కాల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకునే వాడిని. ఆ రోజుల్లో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా లేదు" అని అన్నాడు.
పెద్ద రోల్ ప్లే చేసింది
"శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కాస్టింగ్ కాల్ అందులో చూడడం నాకు ఇంకా గుర్తుంది. దానికి అప్లై చేశాను. దాదాపు 6 నెలలు టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ కూడా ఒక తృప్తిని ఇచ్చేది. ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఆపర్చునిటీ ఉందనే ఆనందం ఉండేది. 16 వేల అప్లికేషన్స్ ఆ సినిమాకి వచ్చాయి. 11 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను కూడా ఉన్నాను. ఆ సినిమా నా జీవితంలో పెద్ద రోల్‌ని ప్లే చేసింది" అని విజయ్ దేవరకొండ తెలిపాడు.
"ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. దిల్ రాజు డ్రీమ్స్‌ని దిల్ రాజు గారికి ఎందుకు లాంచ్ చేయాలని అనిపించిందో నాకు తెలియదు కానీ ఇది లక్షలాది మందికి ఒక హోప్‌ని ఇచ్చింది. ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్" అని విజయ్ దేవరకొండ చెప్పాడు.
14 మంది డైరెక్టర్స్‌ని
"ఇందులో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్సైట్లాంచ్ చేయడానికి న్యాయం జరిగినట్టే. దిల్ రాజు గారు 14 మంది డైరెక్టర్స్‌ని లాంచ్ చేశారు. ఈ వేదిక ద్వారా నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్‌ని లాంచ్ చేయబోతున్నారు" అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.
"ఐదేళ్ల తర్వాత మీలో కూడా ఎవరో ఒకరు ఇలా స్టేజ్ మీద నిలబడి దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా తమ డ్రీమ్‌ని నెరవేర్చుకున్నామని చెప్తే చాలా ఆనంద పడతాను. ఇంత అద్భుతమైన ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసిన దిల్ రాజు గారికి అభినందనలు. అందరికీ థాంక్యు" అని విజయ్ దేవరకొండ తన స్పీచ్ ముగించాడు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



