ఇన్వెస్టిగేషన్‌తోపాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్, నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు: ఫేవరెట్ ఓటీటీ సిరీస్‌పై హీరో నవీన్ చంద్ర

తెలుగు ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్‌కు నవీన్ చంద్ర పాపులర్. అయితే, తాజాగా నవీన్ చంద్ర ఇటీవల ఓటీటీ సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్‌ను నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జూన్ 19న ఏర్పాటు చేసిన విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్ లాంచ్‌లో హీరో నవీన్ చంద్ర కామెంట్స్ చేశాడు.

Published on: Jun 20, 2025, 06:05:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర. రీసెంట్‌గా లెవెన్, బ్లైండ్ స్పాట్ ఓటీటీ సినిమాలతో అలరించాడు. అయితే, తెలుగులో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా వస్తోన్న తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్‌ను తాజాగా నవీన్ చంద్ర రిలీజ్ చేశాడు.

ఇన్వెస్టిగేషన్‌తోపాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్, నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు: ఫేవరెట్ ఓటీటీ సిరీస్‌పై హీరో నవీన్ చంద్ర
ఇన్వెస్టిగేషన్‌తోపాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్, నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు: ఫేవరెట్ ఓటీటీ సిరీస్‌పై హీరో నవీన్ చంద్ర

సీడ్ ఎడ్జ్ థ్రిల్లర్ తర్వాత

రెక్కీ లాంటి సీడ్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత అదే మేకర్స్ నుంచి వస్తోన్న మరో తెలుగు సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్‌లో అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు.

జూన్ 27 నుంచి

జూన్27 నుంచి జీ5లో విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం (జూన్19) విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో నవీన్ చంద్ర విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్ రిలీజ్ చేశాడు. అనంతరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నవీన్ చంద్ర.

పోలీస్ ఆఫీసర్‌గా

నవీన్ చంద్ర మాట్లాడుతూ .. "విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. రెక్కీ నాకు చాలా ఇష్టమైన ఓటీటీ సిరీస్. ఆ డైరెక్టర్ మళ్లీ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’తో రాబోతోన్నారు" అని అన్నాడు.

చాయ్ బిస్కెట్ నుంచి తెలుసు

"అభిజ్ఞ, చరణ్ అద్భుతంగా నటించారనిపిస్తోంది. చాయ్ బిస్కెట్ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. ఆమె అద్భుతమైన నటి. దివ్య లాంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస్‌లో నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు. ఈ సిరీస్ అద్భుతమైన విజయం సాధిస్తుంది" అని నవీన్ చంద్ర తెలిపాడు.

జీ5 ఓటీటీలోకి

"ఈ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్‌లో ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌ని కూడా టచ్ చేసినట్టు కనిపిస్తోంది. జూన్ 27న జీ5 ఓటీటీలోకి రాబోతోన్న ఈ సిరీస్‌తో టీంకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను" అని హీరో నవీన్ చంద్ర కోరాడు.

రెక్కీలానే ఇది కూడా

ఇదే ఈవెంట్‌లో డైరెక్టర్ కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. "నేను జీ5లో ఇది వరకు రెక్కీ ఓటీటీ వెబ్ సిరీస్ చేశాను. అది అద్భుతమైన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ‘విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్’ చేశాను. ఈ ప్రాజెక్ట్‌కి దివ్య గారు కథను అందించారు. రెక్కీలానే ఈ ప్రాజెక్ట్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ సిరీస్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది" అని చెప్పారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More