...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్- అమ్మవారి శాపం, రక్తం కక్కుకుని చచ్చే కొత్త పెళ్లి కూతుళ్లు- ఎక్కడంటే?

ఓటీటీలోకి ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. ఛాయ్ బిస్కెట్ ఫెమ్ అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 27, 2025, 11:59:36 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూ అలరిస్తుంటాయి. వాటిలో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎక్కువగా ఎంగేజ్ చేసే కాన్సెప్ట్ భయం. అవును, ఓటీటీ హారర్ థ్రిల్లర్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే రెగ్యులర్‌గా ఈ జోనర్‌కు ఇతర అంశాలు యాడ్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు.

రెక్కీ వెబ్ సిరీస్ మేకర్స్ నుంచి

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్- అమ్మవారి శాపం, రక్తం కక్కుకుని చచ్చే పెళ్లి కూతుళ్లు- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్- అమ్మవారి శాపం, రక్తం కక్కుకుని చచ్చే పెళ్లి కూతుళ్లు- ఎక్కడంటే?

అలా ఇవాళ ఓటీటలోకి వచ్చిన తెలుగు సిరీసే విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ వెబ్ సిరీస్‌కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఇదివరకు ఓటీటీలో సూపర్ హిట్ అయిన రెక్కీ వెబ్ సిరీస్ నిర్మాతలు ఈ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్‌ను రూపొందించారు.

కొత్త పెళ్లికూతుళ్ల మరణాలు

ఛాయ్ బిస్కెట్ ఫేమ్ అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్ మూఢ నమ్మకాలు, అంతు చిక్కని కొత్త పెళ్లి కూతుళ్ల మరణాలు వంటి అంశాలతో థ్రిల్లింగ్‌గా సాగుతుంది. విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ కథలోకి వెళితే విరాటపాలెం గ్రామంలో కొత్తగా పెళ్లి అయిన నవ వధువులంత రక్తం కక్కుని చచ్చిపోతుంటారు.

అమ్మవారి శాపం

ఆ గ్రామానికి అమ్మవారు శాపం పెట్టిందని, అందుకే కొత్త పెళ్లి కూతుళ్లు వివాహం జరగ్గానే మరణిస్తున్నారని గ్రామ ప్రజలు నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ మీనా ఆ మరణాలను కళ్లారా చూస్తుంది. అది చూసి చలించిపోయిన మీనా ఆ కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తుంది.

విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ

హారర్ అంశాలు ఉన్న విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (జూన్ 27) జీ5లో తెలుగు భాషలో హారర్ థ్రిల్లర్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి హారర్, మిస్టరీ థ్రిల్లర్ అంశాలు నచ్చే ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్‌ను ఎంచక్కా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe