వైరల్ వయ్యారి సాంగ్ కు బామ్మ డ్యాన్స్ వైరల్.. కాలు కదిపిన సుమ.. అదిరే స్టెప్పులు.. ఎవరీ సీనియర్ నటి?

ప్రస్తుతం యూట్యూబ్ షార్ట్స్ లో, సోషల్ మీడియా రీల్స్ లో ‘వైరల్ వయ్యారి’ సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ కు డ్యాన్స్ లు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ అదిరే సాంగ్ ఓ బామ్మను కూడా హుషారుగా డ్యాన్స్ చేయించింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Jul 17, 2025, 11:39:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైరల్ వయ్యారి.. ఇప్పుడు చిన్నవాళ్ల నుంచి ముసలి వాళ్ల వరకూ అందరితో డ్యాన్స్ చేయిస్తున్న పాపులర్ సాంగ్ ఇది. జూనియర్ మూవీలోని ఈ సాంగ్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్, సోషల్ మీడియా ఇలా ఎక్కడైనా ఈ సాంగ్ రీల్స్, షార్ట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వైరల్ సాంగ్ కు ఓ బామ్మ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

వైరల్ వయ్యారి సాంగ్ కు డ్యాన్స్ (youtube)
వైరల్ వయ్యారి సాంగ్ కు డ్యాన్స్ (youtube)

ప్రి రిలీజ్ ఈవెంట్ లో

పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జూనియర్ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ మూవీ జూలై 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం (జూలై 16) హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ ప్రారంభంలోనే బామ్మ వైరల్ డ్యాన్స్ చేసింది.

ఎవరంటే?

జూనియర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో బామ్మ చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. యాంకర్ సుమ పిలవగానే కుర్చీలో నుంచి లేచి వచ్చిన బామ్మ.. ‘‘వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబును’’ అంటూ తెగ హుషారుగా స్టెప్పులు వేసింది. శ్రీలీల ఎనర్జీని మ్యాచ్ చేసేంతగా ఈ బామ్మ డ్యాన్స్ ఉండటం నెటిజన్లతో వావ్ అనిపిస్తోంది. ఆ బామ్మ పేరు మణి. తెలుగు సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు చేశారు ఆమె. సీనియర్ ఆర్టిస్ట్ గా నటనతో అలరించే ఆవిడలో ఇలాంటి యాంగిల్ ఉందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు.

సుమ స్టెప్పులు

సీనియర్ నటి మణి డ్యాన్స్ చూసి యాంకర్ సుమకు కూడా ఊపొచ్చింది. వెంటనే మైక్ పక్కనపెట్టేసి వైరల్ వయ్యారికి సుమ కూడా డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. స్టేజీ దద్దరిల్లిపోయింది. బామ్మ ఎనర్జీ వేరే లెవల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సెన్సేషన్

కిరీటీ ఫస్ట్ సినిమా జూనియర్. దీనికి ‘మాయా బజార్’ ఫేమ్ రాధాకృష్ణ రెడ్డి డైరెక్టర్. తెలుగుతో పాటు కన్నడలో ఈ సినిమాను తెరకెక్కించారు. యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. వైరల్ వయ్యారి సాంగ్ లో శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి. ఈ సినిమాతో 13 ఏళ్ల తర్వాత జెనీలియా తెలుగు అభిమానులను పలకరించనుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More