Vvan Trailer: తమన్నా థ్రిల్లర్ మూవీ.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్.. అడవిని కాపాడే హీరో

Vvan Trailer: తమన్నా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న వాన్ మూవీ ట్రైలర్ ను బుధవారం (సెప్టెంబర్ 16) మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది ఓ అడవి చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్ స్టోరీలా కనిపిస్తోంది.

Published on: Sep 16, 2026, 21:35:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vvan Trailer: బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (Vvaan: Force Of The Forest) ట్రైలర్ రిలీజ్ అయింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

Vvan Trailer: తమన్నా థ్రిల్లర్ మూవీ.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్.. అడవిని కాపాడే హీరో
Vvan Trailer: తమన్నా థ్రిల్లర్ మూవీ.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్.. అడవిని కాపాడే హీరో

ముంబైలో హ్యాపీగా జీవించే భార్యాభర్తలుగా సిద్ధార్థ్, తమన్నా కనిపించారు. ఛత్ పూజ వేడుకల కోసం తమ సొంత ఊరికి తిరిగొచ్చిన ఈ జంటకు అక్కడ ఊహించని భయంకర పరిస్థితులు ఎదురవుతాయి.

రాత్రిపూట ఆ అడవిలోకి వెళ్తే చావే.. నెత్తురోడే యాక్షన్ సీన్లు

గ్రామంలో ఉండే 'వాన్ దేవి' పవిత్ర అడవిని నాశనం చేసి బిల్డింగ్‌లు కట్టడానికి విలన్ క్యారెక్టర్ (సునీల్ గ్రోవర్) ప్లాన్ చేస్తాడు. అయితే రాత్రి వేళ ఆ అడవిలోకి ఎవరు వెళ్లినా ప్రాణాలతో తిరిగి రారనే భయంకరమైన నమ్మకం గ్రామస్తుల్లో ఉంటుంది.

అందరి హెచ్చరికలను పక్కనపెట్టి రాత్రిపూట అడవిలోకి వెళ్లిన సిద్ధార్థ్ తీవ్రంగా గాయపడతాడు. పూర్వజన్మలో కూడా ఈ అడవిని, అక్కడి ఆచారాలను కాపాడే బాధ్యత తనదేననే నిజాన్ని హీరో తెలుసుకుంటాడు. ఆ తర్వాత చెట్లను నరకాలనుకునే ముఠాపై సిద్ధార్థ్ ఎలా తిరగబడ్డాడనేదే అసలు సిసలైన యాక్షన్ డ్రామా.

'పంచాయత్' డైరెక్టర్ విజన్.. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్

దేవుడిపై ఉన్న నమ్మకం, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం మధ్య జరిగే ఘర్షణను డైరెక్టర్ దీపక్ మిశ్రా చాలా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. 'పంచాయత్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న దీపక్ మిశ్రా.. ఈసారి భారీ కాన్వాస్‌పై ఈ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌ను డిజైన్ చేశారు.

టీవీఎఫ్ (TVF) ఫౌండర్ అరుణభ్ కుమార్ కథ అందించగా, బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. సునీల్ గ్రోవర్, శ్వేతా తివారీ, మనీష్ పాల్, అనూప్ సోని లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సిద్ధార్థ్‌తో నటించడం నా కల.. స్పందించిన తమన్నా

ఇటీవల జరిగిన ఒక ప్రైమ్ వీడియో ఈవెంట్‌లో తమన్నా మాట్లాడుతూ సిద్ధార్థ్‌తో వర్క్ చేయడం తన డ్రీమ్ అని పంచుకున్నారు. "చిన్నప్పటి నుంచి నేను వింటూ పెరిగిన కథల్లాంటి ఒక స్ట్రాంగ్ సోల్ ఉన్న స్క్రిప్ట్ ఇది. సిద్ధార్థ్ చాలా గ్రేట్ యాక్టర్, ఆయనతో కలసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది" అని తమన్నా చెప్పుకొచ్చారు.

సిద్ధార్థ్ మల్హోత్రా గతంలో 'పరమ్ సుందరి' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' సినిమాతో సెప్టెంబర్ 25, 2026న థియేటర్లలో భారీగా విడుదల కానున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More