ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఒకటి, రెండు కాదు.. ఒక్కో ఓటీటీలోకి ఈ వారం ఒక్కో హిట్ మూవీ అందుబాటులోకి వచ్చింది. మలయాళం బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ నరివెట్ట కూడా ఇందులో ఉంది. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
నరివెట్ట - సోనీలివ్ ఓటీటీ

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ నరివెట్ట (narivetta) సోనీ లివ్ ఓటీటీలో గురువారం (జులై 10) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
8 వసంతాలు - నెట్‌ఫ్లిక్స్
తెలుగు రొమాంటిక్ డ్రామా 8 వసంతాలు మూవీ శుక్రవారం (జులై 11) నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కు రావడం విశేషం. 8 వసంతాలు మూవీని ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేశాడు. ఇందులో మ్యాడ్ మూవీతో పాపులర్ అయిన నటి అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డిలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ శుద్ధి అయోధ్య (అనంతిక) అనే అమ్మాయి, ఆమె ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ఈ నెట్‌ఫ్లిక్స్ లోనే ఆప్ జైసా కోయి అనే మాధవన్ నటించిన సినిమా కూడా ఉంది.
మూన్‌వాక్ - జియోహాట్‌స్టార్
మలయాళం డ్యాన్స్ మూవీ మూన్వాక్ కూడా ఈ వారమే జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. బ్రేక్ డ్యాన్స్ పై మక్కువతో కేరళలోని ఓ మారుమూల పట్టణానికి చెందిన కొందరు యువకులు సొంతంగా డ్యాన్స్ నేర్చుకుంటారు. ఆ యువకుల ఎమోషనల్ జర్నీని ఈ సినిమా కళ్లకు కడుతుంది.
కలియుగమ్ - సన్ నెక్ట్స్
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలియుగమ్. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ నటించిన ఈ డిస్టోపియన్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. 2064లో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇదే ఓటీటీలో చెన్నై సిటీ గ్యాంగ్స్టర్స్ అనే మరో తమిళ కామెడీ సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది.
శారీ - ఆహా వీడియో
{{/usCountry}}తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలియుగమ్. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ నటించిన ఈ డిస్టోపియన్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. 2064లో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇదే ఓటీటీలో చెన్నై సిటీ గ్యాంగ్స్టర్స్ అనే మరో తమిళ కామెడీ సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది.
శారీ - ఆహా వీడియో
{{/usCountry}}రామ్ గోపాల్ వర్మ సమర్పించిన బోల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ శారీ. ఈ సినిమా ఆహా వీడియోలో అందుబాటులో ఉంది. ఏప్రిల్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆరాధ్యదేవి అనే ఓ అమ్మాయి, ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడే ఓ అబ్బాయి చుట్టూ తిరిగే సినిమా ఇది.
సంతోషం - ఈటీవీ విన్
మలయాళం కామెడీ డ్రామా సంతోషం ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి రావడం విశేషం.