ఎవరీ కల్పిక గణేష్? ఆమెపై కేసు ఎందుకు? ట్రెండింగ్ లో టాలీవుడ్ బ్యూటీ.. ఆమె చేసిన సినిమాలు ఏవంటే?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ కల్పిక గణేష్ పేరు ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ అందాల భామపై పోలీస్ కేసు నమోదు కావడమే కారణం. మరి కల్పిక ఏం చేసిందంటే? 

Jun 14, 2025, 16:48:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కల్పిక గణేష్.. ఈ పేరు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో నెటిజన్లు ఈ పేరు వెతుకుతున్నారు. మరి ఈ కల్పిక గణేష్ ఎవరు? ఆమె ఏం చేసిందంటే? టాలీవుడ్ యంగ్ బ్యూలీ కల్పిక గణేష్ తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇంటర్నెట్ లో హాట్ ఫొటోస్ తో అలరిస్తోంది ఈ భామ. కానీ ఇప్పుడు ఆమె ట్రెండింగ్ లో ఉండటానికి కారణం పోలీస్ కేసు. ఆమెపై పెట్టిన కేసు ఏంటీ? అందుకు కారణం ఏంటో? ఇక్కడ చూసేయండి.

కల్పిక గణేష్ (instagram)
కల్పిక గణేష్ (instagram)

పబ్ లో హల్ చల్

మే 29న గచ్చిబౌలీలోని ప్రిజమ్ పబ్ కు వెళ్లింది కల్పిక గణేష్. పోలీసులకు ప్రిజమ్ పబ్ నిర్వాహకులు చేసిన ఫిర్యాదు మేరకు.. నటి కల్పిక గణేష్ ఓ వ్యక్తితో కలిసి ఆ పబ్‌కి వెళ్లింది. రూ. 2,200 బిల్ చేసింది. దీంతో డెజర్ట్ గా చీజ్ కేక్ ను ఫ్రీగా ఇవ్వాలని స్టాఫ్ ను ఫోర్స్ చేసింది. గుడ్‌విల్ గెస్టర్‌గా స్టాఫ్ బ్రౌనీ ఇవ్వగా.. ఆమె తిరస్కరించింది. అనంతరం డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్‌లపై అసభ్య వ్యాఖ్యలతో రెచ్చిపోతూ దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ప్లేట్ విసిరేసి

బిల్ కట్టకుండా, చీజ్ కేక్ కోసం గొడవ పడ్డ కల్పిక గణేష్ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. బ్రౌనీ ప్లేట్ ను విసిరేసింది. ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోనూ అనుచిత ఆరోపణలు చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమెపైనే దాడికి ప్రయత్నించినట్లు తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో పెట్టారని పబ్ నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత ఒకట్రెండు ఇంటర్వ్యూల్లోనూ పబ్ బ్రాండ్, పరువుకు నష్టం కలిగేలా ఆరోపణలు చేసింది.

ఆ ఫిర్యాదుతో కేసు

నిజానికి ప్రిజమ్ పబ్ లో కల్పిక గణేష్ రచ్చ చేసింది మే 29న. కానీ ప్రిజమ్ క్లబ్ అండ్ మేనేజింగ్ పార్ట్ నర్ దీపక్ బజాజ్ జూన్ 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూల్లో ఆ పబ్ కు చెడ్డ పేరు వచ్చేలా కల్పిక చేసిన ఆరోపణలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదు మేరకు ఆమెపై సెక్షన్ 324 (4), 352 (రెచ్చగొట్టేలా దూషణ), 351 (క్రిమినల్ బెదిరింపులు) కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ సినిమాల్లో

క్యారెక్టర్ ఆర్టిస్ట్ కల్పిక గణేష్ తెలుగులో చాలా సినిమాలో చేసింది. 2009లో ప్రయాణంతో సినీ కెరీర్ మొదలెట్టిన ఆమె.. ఆరెంజ్ లో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసింది. నమో వెంకటేశ, మారో, జులాయి, సారొచ్చారు, నిప్పు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలు చేసింది. పడి పడి లేచే మనసు సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి స్నేహితురాలి క్యారెక్టర్ చేసింది. హిట్ 1, యశోద, అథర్వ సినిమాల్లోనూ కనిపించింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More