కోట్లు ఖర్చు పెట్టి ఏళ్లు కష్టపడింది కించపరచడానికి కాదు.. కన్నప్ప బ్రహ్మణుల వివాదంపై రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ కామెంట్స్

మంచు విష్ణు నటించిన లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ మూవీ కన్నప్పలో పిలక-గిలక అనే పాత్రలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కన్నప్ప బ్రహ్మణుల వివాదంపై మూవీ రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ కామెంట్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయాలతో క్లారిటీ ఇచ్చారు.

Jun 19, 2025, 14:01:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూన్ 27న కన్నప్ప రిలీజ్

ఇక ఇదిలా ఉంటే, కన్నప్ప మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. కన్నప్ప ట్రైలర్ చూశాక సినిమాపై మంచి అంచనాలు పెరిగిపోయాయి. దాంతో కన్నప్ప మూవీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా కన్నప్ప మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేసింది.

కోట్లు ఖర్చు పెట్టి ఏళ్లు కష్టపడింది కించపరచడానికి కాదు.. కన్నప్ప బ్రహ్మణుల వివాదంపై రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ కామెంట్స్
కోట్లు ఖర్చు పెట్టి ఏళ్లు కష్టపడింది కించపరచడానికి కాదు.. కన్నప్ప బ్రహ్మణుల వివాదంపై రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ కామెంట్స్
కన్నప్ప వివాదంపై రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ రిలీజ్ చేసిన లేఖ
కన్నప్ప వివాదంపై రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ రిలీజ్ చేసిన లేఖ

మంచు విష్ణు నటించిన లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ మూవీ కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించిన కన్నప్ప సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, శివరాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి అగ్ర తారలు నటించారు.

కన్నప్ప మూవీపై ఆగ్రహం

వీరితోపాటు కన్నప్ప సినిమాలో పిలక-గిలక అనే పాత్రల్లో కమెడియన్స్ బ్రహ్మానందం, సప్తగిరి యాక్ట్ చేశారు. అయితే, ఇదే కన్నప్ప మూవీపై బ్రహ్మాణ సంఘాలు ఆగ్రహానికి గురవడానికి కారణం అయింది. బ్రహ్మణులను కించపరచడానికే అలాంటి హాస్య పాత్రలు రూపొందించారని అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఏ ఒక్క సీన్ కూడా

ఈ వివాదంపై కన్నప్ప మూవీ రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ స్పందించారు. "నేను ఒక బ్రహ్మణుడిని. కన్నప్ప మూవీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ కూడా నార్ ఇండియాకు చెందిన బ్రాహ్మణుడే. బ్రహ్మణులును కానీ ఇతర వేరే కమ్యునిటీ వాళ్లను గానీ కన్నప్ప సినిమాలోని ఏ ఒక్క సీన్ కించపరచేవిధంగా లేదు" అని ఆకెళ్ల శివ ప్రసాద్ తెలిపారు.

చాలా గౌరవంగా చిత్రీకరించాం

అయితే, ఇదివరకు కన్నప్ప స్టోరీని ఆలయ పూజారులు నెగెటివ్‌గా తీసుకున్నారుని, కానీ, ఈ సినిమాను వేరే విధంగా మలిచామని రేటర్ శివ ప్రసాద్ పేర్కొన్నారు. "మోహన్ బాబు పోషించిన మహాదేవ శాస్త్రి పాత్రను చాలా గౌరవంగా, భక్తితో చిత్రీకరించారం. దాన్ని 16వ శతాబ్దపు కవి ధూర్జటి రాసిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం నుంచి ప్రేరణ పొంది తీశాం" అని ఆయన వెల్లడించారు.

ఆశీర్వాదాలు అందించారు

"ఇంకా చెప్పాలంటే కన్నప్ప సినిమాను శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన పూజారులకు స్పెషల్‌గా ప్రదర్శించాం. కన్నప్ప చూసిన వారు సినిమాను అభినందించారు. అలాగే మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరికి ఆశీర్వాదాలు అందించారు" అని చెప్పుకొచ్చారు రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్.

అందుకోసం కోట్లు ఖర్చు పెట్టరు

"కన్నప్ప గీత రచయిత రామజోగయ్య శాస్త్రితో సహా చాలా మంది బ్రాహ్మణులు కన్నప్ప సినిమాలో వివిధ భాగాల్లో పని చేశారు. ఏ ఒక్క కమ్యునిటీని కించపరచడానికి ఎవరు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, సంవత్సరాలు కష్టపడరు. ఈ రూమర్స్ అన్ని నిరాధారమైనవి. సినిమా చూశాకే మీకే తెలుస్తుంది" అని డైలాగ్ రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ వెల్లడించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More