...
...
Next Story

హారర్ మూవీ లోపలికి రా చెప్తా ట్రైలర్ రిలీజ్.. భయపెట్టే విషయాలు బయట కూడా చాలా జరుగుతున్నాయన్న రైటర్ విజయేంద్ర ప్రసాద్

రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ లోపలికి రా చెప్తా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవల జరిగిన లోపలికి రా చెప్తా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..!

Published on: Jun 23, 2025, 06:25:33 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

రోజురోజుకు తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంటూ ముందుకు రానున్న సినిమా "లోపలికి రా చెప్తా". మాస్ బంక్ మూవీస్ పతాకంపై వెంకట రాజేంద్ర నిర్మించిన తెలుగు హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లోపలికి రా చెప్తా’. ఈ సినిమాలో కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించారు.

హీరోగా నటించడమే కాకుండా

హారర్ మూవీ లోపలికి రా చెప్తా ట్రైలర్ రిలీజ్.. భయపెట్టే విషయాలు బయట కూడా చాలా జరుగుతున్నాయన్న రైటర్ విజయేంద్ర ప్రసాద్
హారర్ మూవీ లోపలికి రా చెప్తా ట్రైలర్ రిలీజ్.. భయపెట్టే విషయాలు బయట కూడా చాలా జరుగుతున్నాయన్న రైటర్ విజయేంద్ర ప్రసాద్

అలాగే, లక్ష్మీ గణేష్, కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.

లోపలికి రా చెప్తా ట్రైలర్ లాంచ్

శనివారం (జూన్ 21) హైదరాబాద్‌లో లోపలికి రా చెప్తా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా లోపలికి రా చెప్తా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

బయట కూడా చాలా జరుగుతున్నాయి

రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "లోపలికి రా చెప్తా సినిమా ట్రైలర్ లాంఛ్‌కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుంది. అయితే మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలో లాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి" అని అన్నారు.

మంచి కలెక్షన్స్ కూడా

ఇదే ఈవెంట్‌లో నటుడు రమేష్ మాట్లాడుతూ.. "నేను నాటకరంగం నుంచి వచ్చాను. ఈ చిత్రంతో మళ్లీ తెరపై కనిపించడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా రాజేంద్ర గారికి థ్యాంక్స్. క్యాచీ టైటిల్‌తో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిమ్మల్ని భయపెడుతూనే ఎంటర్‌టైన్ చేస్తుంది" అని చెప్పుకొచ్చారు.

మంచి మూవీ అవుతుందని

"ప్రేక్షకుల్ని లోపలికి రా చెప్తా అని పిలిచే ఫీల్‌తో మా డైరెక్టర్ మంచి టైటిల్ సినిమాకు పెట్టారు. ఈ చిత్రంలో ఓ మంచి రోల్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ గురించి తెసినప్పుడే ఇది మంచి మూవీ అవుతుంది అనే నమ్మకం కలిగింది" అని యాక్టర్ ప్రవీణ్ కటారి తెలిపారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks