ఏ మంత్రమో సాంగ్ లిరిక్స్.. అందాల రాక్షసిలోని ఈ సూపర్ మెలోడీని మీరూ పాడుకోండి

అందాల రాక్షసి మూవీ 13 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీయే కాదు.. ఇందులోని పాటలు కూడా అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని ఏ మంత్రమో సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.

Published on: Jun 5, 2025, 15:33:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అందాల రాక్షసి మూవీ తెలుసు కదా. 2012లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ మూవీ జూన్ 13న రీరిలీజ్ కాబోతోంది. హను రాఘవపూడికి డైరెక్టర్ గా తొలి సినిమా. అంతేకాదు అందాల రాక్షసి, ఇప్పుడు మెగా ఇంటి కోడలు అయిన లావణ్య త్రిపాఠీకి అదే తొలి మూవీ. అందులో తన అమాయకపు చూపులు, అందంతో కట్టిపడేసింది. ఈ మూవీలోని ఏ మంత్రమో పాటలో ఆమె మరింత క్యూట్ గా కనిపిస్తుంది.

ఏ మంత్రమో సాంగ్ లిరిక్స్.. అందాల రాక్షసిలోని ఈ సూపర్ మెలోడీని మీరూ పాడుకోండి
ఏ మంత్రమో సాంగ్ లిరిక్స్.. అందాల రాక్షసిలోని ఈ సూపర్ మెలోడీని మీరూ పాడుకోండి

ఏ మంత్రమో సాంగ్ గురించి..

అందాల రాక్షసి సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులను అప్పట్లో అలరించాయి. అయితే ఈ ఏ మంత్రమో సాంగ్ మాత్రం మరికాస్త ఎక్కువగానే ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఇప్పటికే 18 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

రాధన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను వశిష్ట శర్మ రాశాడు. ఇక బోబో షాహి పాట పాడాడు. ఇప్పటికీ యువత మెచ్చే సాంగ్ ఇది. అందాల రాక్షసి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వేళ.. ఏ మంత్రమో పాటను మరోసారి నెమరువేసుకుంటూ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.

అందాల రాక్షసి మూవీ 2012లో రిలీజైంది. ఇందులో లావణ్య త్రిపాఠి, రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్రలాంటి వాళ్లు నటించారు. ఈ ముగ్గురికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం. సాయి కొర్రపాటితోపాటు కలిసి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీని నిర్మించడం విశేషం.

ఏ మంత్రమో సాంగ్ లిరిక్స్

ఏ మంత్రమో.. అల్లేసిందిలా

ఎదకే వేసే సంకెళా

భూమెందుకో.. వణికిందే ఇలా

బహుశా తనలో.. తపనకా

ఆకాశం రూపం మారిందా

నాకోసం వానై జారిందా

గుండెల్లో ప్రేమై చేరిందా

ఆ ప్రేమే నిన్నే కోరిందా

మబ్బుల్లో ఎండమావే

ఎండంతా వెన్నెలాయె

మనసంతా మాయమాయే ఐనా హాయే

క్షణము ఒక రుతువుగ మారే

ఉరుము ప్రతి నరమును తరిమే

పరుగులిక వరదలై పోయే కొత్తగా

ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే

పగలు వల విసిరె ఊహలె

మనసు మతి చెదరగ శిలగా నిలిచెగా

కళ్ళల్లో కదిలింత.. కలగా కల కరిగిపోకలా

ఎదురయ్యే వేళల్లో.. నువు ఎగిరి పోకలా

ఓ మాయలా ఇంకో మాయలా

నన్నంత మార్చేంతలా

ఓ మాయలా ఇంకో మాయలా

నువ్వే నేనయ్యేంతలా..

వెన్నెల్లా…….

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More