చెరిగిపోని పచ్చబొట్టు.. సమంత మెడపై చైతన్య మూవీ నేమ్.. తాజా ఫొటోలు వైరల్
సమంత తన మెడపై ఉన్న ‘వైఎంసీ’ టాటూ తొలగించుకుందని ఇటీవల వార్తలొచ్చాయి. ఓ వీడియోలో ఆ టాటూ కనిపించలేదు. కానీ రీసెంట్ ఫొటోల్లో ఆ టాటూ ఉంది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన సమంత ఫొటోలు వైరల్ గా మారాయి.
సమంత పోస్టు చేసిన వీడియోలో ఆమె శరీరం వెనుక భాగంలో మెడ కింద ‘వైఎంసీ’ అనే టాటూ లేదు. తన వీపుపై కొన్నేళ్ల క్రితం నాగచైతన్యను పెళ్లి చేసుకున్నప్పుడు వేయించుకున్న టాటూ అప్పుడు మిస్ అయింది. 'ఏ మాయ చేసావే' సినిమాను సూచిస్తూ సమంత వేసుకున్న వైఎంసీ టాటూ కనిపించడం లేదని కొందరు అభిమానులు పేర్కొన్నారు. 'సమంత తన వైఎంసీ టాటూను తొలగించింది' అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. "నాకు పచ్చబొట్టు కనిపించడం లేదు" అని మరొకరు పేర్కొన్నారు.
సమంత మెడపై పచ్చబొట్టు (x)
జిమ్ బయట ఫొటోలు
సమంత ఇటీవల ముంబయిలోని జిమ్ నుంచి బయటకు వస్తూ ఫొటోగ్రాఫర్ల కంట పడింది. ఫొటోలు తీయొద్దని సమంత ఫైర్ అయినా ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఈ ఫొటోల్లో కొన్ని బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాయి. ఈ ఫొటోల్లోనే సమంత మెడపై వైఎంసీ టాటూ కనిపించింది. దీంతో ఆ యాడ్ వీడియో కోసం సమంత టాటూను కవర్ చేసిందని, ఆ పచ్చబొట్టు చెరిగిపోలేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఆ సినిమాతోనే
సమంతకు ఏ మాయ చేసావే పచ్చబొట్టు ఎంతో స్పెషల్. 2010లో సమంత నటిగా అరంగేట్రం చేసిన చిత్రం ఏ మాయ చేసావే. హీరో నాగ చైతన్యకు ఆమెను పరిచయం చేసింది కూడా ఆ సినిమానే. కొన్నాళ్లకు డేటింగ్ మొదలుపెట్టిన వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. యితే నాగచైతన్య, సమంత 2020లో విడిపోగా, 2021లో విడాకులు ఖరారయ్యాయి. సమంత ఇటీవల ప్రొడ్యూసర్ గా మారి శుభం మూవీ నిర్మించింది. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ లో ఉందనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి.
స్టార్ నటి సమంత బాడీపై టాటూస్ ఉన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యను గతంలో పెళ్లి చేసుకున్న ఆమెతో కొన్ని మెమొరీస్ ఎప్పటికీ నిలిచిపోవాలని టాటూస్ వేయించుకుంది. కానీ చైతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ పచ్చబొట్లను చెరిపేస్తోంది. ఈ క్రమంలో మెడపై ఉన్న వైఎంసీ టాటూను కూడా తొలగించుకుంది అనే వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ ఫొటల్లో ఆ టాటూ కనిపించింది.
ఆ వీడియోలో మిస్
సమంత రూత్ ప్రభు రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. నథింగ్ టు హైడ్ ప్రకటనతో జూన్ 6న వీడియో పెట్టింది. ఈ వీడియోలో సమంత కెమెరా దగ్గరికి వెళ్లి మార్కర్ తో 'నథింగ్ టు హైడ్' అని రాస్తోంది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి వెళ్లిపోతుంది. వెనక్కి వెళ్లిపోతున్న సమయంలోనే సమంత శరీరంపైటాటూ మిస్ అయిన సంగతి ఫ్యాన్స్ కంటపడింది.
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More