Youtube Thrillers: యూట్యూబ్‌లో ఫ్రీగా చూడగలిగే ఐదు మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. మెడికల్ మాఫియా చుట్టూ..
Youtube Thrillers: యూట్యూబ్ లో పైసా ఖర్చు పెట్టకుండా మంచి థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే ఐదు సినిమాలను అస్సలు మిస్ కావద్దు. మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే ఈ మూవీస్ మిమ్మల్ని సీట్ల అంచున కూర్చోబెడతాయి.
Youtube Thrillers: సౌత్ సినిమా అంటేనే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లు, మైండ్ బెండింగ్ ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్. యాక్షన్, మైండ్ గేమ్ కాన్సెప్ట్‌లతో పాటు హాస్పిటల్స్, మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సస్పెన్స్ సినిమాలను రూపాయి ఖర్చు లేకుండా యూట్యూబ్‌లో ఉచితంగా చూసేయొచ్చు.

మంచి ఐఎండీబీ (IMDb) రేటింగ్‌తో పాటు డబ్బింగ్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఆ టాప్ 5 మెడికల్ థ్రిల్లర్ మూవీస్ కథాంశాలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం.
1. నైట్ కర్ఫ్యూ (Night Curfew - 2024)
2024లో విడుదలైన కన్నడ హిట్ మూవీ 'నైట్ కర్ఫ్యూ' ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగే దారుణాలను కళ్లకు కడుతుంది. ఆర్మీ నుంచి రిటైర్ అయిన ఒక మాజీ డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరినప్పుడు, ట్రీట్మెంట్ ప్రారంభించక ముందే ఒక మహిళ మరణించడం అతనికి అనుమానం కలిగిస్తుంది.
ఆ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో అతనికి ఎదురైన నిజాలు షాకింగ్‌గా ఉంటాయి. 7.6 ఐఎండీబీ రేటింగ్ సాధించిన ఈ సస్పెన్స్ డ్రామా యూట్యూబ్‌లో హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది.
2. కెయాస్ (Chaos - 2023)
మెడికల్ కాలేజ్ క్యాంపస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సీట్ ఎడ్జ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'కెయాస్'. 2023లో వచ్చిన ఈ కన్నడ సినిమాలో ఒక మెడికల్ స్టూడెంట్ ఊహించని విధంగా ఓ సంచలనాత్మక కేసులో ఇరుక్కుంటాడు.
అసలు ఆ కేసు వెనుక ఉన్న డాక్టర్ల నెట్‌వర్క్ ఏంటి? ఆ కుట్ర నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేది దర్శకుడు చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాడు. ఈ సినిమా 7.1 ఐఎండీబీ రేటింగ్‌తో యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
3. ఆక్టోపస్ (Octopus - 2015)
పేద గుండె రోగులకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనుకునే డాక్టర్ యశ్వంత్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అతడు అనుకోకుండా ఫార్మాస్యూటికల్ మాఫియా పన్నిన కుట్రల వలలో చిక్కుకుంటాడు.
ఎంతటి పెద్ద మెడికల్ నెట్‌వర్క్ అయినా సరే ఒక ఆక్టోపస్ లాగా సమాజాన్ని ఎలా చుట్టేస్తుందో ఈ చిత్రం వివరిస్తుంది. 5.5 ఐఎండీబీ రేటింగ్ ఉన్న ఈ సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు.
4. ఇరవన్ (Iravan - 2023)
విదేశాల్లో చదువుకునే ఒక యువకుడు తన తండ్రి అనుమానాస్పద మరణం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ఇండియా వస్తాడు. అతడి ఇన్వెస్టిగేషన్‌లో మెడికల్ మాఫియాకి చెందిన విస్తుపోయే నిజాలు బయటపడతాయి.
4.7 ఐఎండీబీ రేటింగ్ ఉన్నప్పటికీ, సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్, మెడికల్ మాఫియా డాక్యుమెంటేషన్ ఓటీటీ వీక్షకులను బాగానే అలరిస్తాయి.
5. అదర్స్ (Others - 2025)
2025లో వచ్చిన 'అదర్స్' చిత్రం ఐవీఎఫ్ (IVF) సంతాన సాఫల్య కేంద్రాల వెనుక ఉన్న డార్క్ సైడ్‌ను హైలైట్ చేస్తుంది. ఐవీఎఫ్ ద్వారా జన్మించిన పిల్లలు వింతైన రోగాల బారిన పడుతుండటంతో ఓ పోలీస్ ఆఫీసర్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు.
ఆ పరిశోధనలో అతనికి ఎదురైన నిజాలు చూసే ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేస్తాయి. 6.7 ఐఎండీబీ రేటింగ్ సాధించిన ఈ కొత్త కాన్సెప్ట్ సినిమా ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


