త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ లా కథలు రాస్తారా? సినిమాలకు స్టోరీలు అందించాలని ఉందా? అయితే జీ రైటర్స్ రూమ్ ఛాన్స్ మీ కోసమే!
మీకు సినిమాలంటే పిచ్చా? మంచి స్టోరీలు రాయగలరా? సినిమాలకు కథలు అందించాలని ఉందా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే. ప్రముఖ కంటెంట్ సంస్థ జీ ఎంటర్ టైన్ మెంట్ యంగ్ రైటర్స్ కోసం ఓ ప్రోగ్రాం తీసుకొచ్చింది. దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ చూసేయండి.
త్రివిక్రమ్, కొరటాల శివ.. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లు. కానీ వీళ్ల జర్నీ సినిమా రైటర్స్ గానే మొదలైంది. సుకుమార్, పూరీ జగన్నాథ్ లాంటి అగ్రశ్రేణి దర్శకులు ఇప్పటికీ కథలు రాస్తున్నారు. ఇలా మీరు ఎదగాలని ఉందా? ఇలాంటి వాళ్లకు పాపులర్ టీవీ, ఓటీటీ నెట్ వర్క్ గ్రూప్ ‘జీ’ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా కథలు రాయాలనే ఆసక్తి, రచనపై పట్టు ఉండి.. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ‘జీ’ నెట్ వర్క్ చెప్పిన అద్భుతమైన వార్త ఇది. దేశవ్యాప్తంగా ఉన్న యువతరం, భవిష్యత్ స్క్రీన్ రైటర్లను గుర్తించి, వెలుగులోకి తీసుకొచ్చే లక్ష్యంతో, ఒక మైలురాయి కార్యక్రమంగా ‘జీ రైటర్స్ రూమ్’ను ప్రారంభించినట్లు ప్రముఖ కంటెంట్, టెక్నాలజీ పవర్‌హౌస్ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (‘Z’) సగర్వంగా ప్రకటించింది.

అదిరే అవకాశం
జీ రైటర్స్ రూమ్ అనేది ప్రతిభను అన్వేషించే ప్రయత్నం కంటే మించింది. 'యువర్స్ ట్రూలీ Z' అనే కంపెనీ బ్రాండ్తో ముడిపడిన ఒక సృజనాత్మక ఉద్యమం ఇది. అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ తన కంటెంట్ సమర్పణను మరింత మెరుగుపరచడమే దీని లక్ష్యం. లేటెస్ట్ స్టోరీస్ కోసం డిమాండ్ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో.. మూల కథ చెప్పే సామర్థ్యం, స్క్రీన్ రైటింగ్ అనే వృత్తిగత ప్రపంచం మధ్య అంతరం తగ్గించాలన్నది ఈ కార్యక్రమ ఉద్ధేశం. ఎంపిక చేసిన రచయితలు ‘జీ’ పరిధిలోని విస్తృత స్థాయి టీవీ, ఓటీటీ, ఫిల్మ్ ప్లాట్‌ఫామ్‌ల కోసం కథలు రూపొందించేందుకు ఈ ఈ కార్యక్రమం అవకాశం అందిస్తుంది.
ఏడు భాషల్లో
80 నగరాలు, 32 ఈవెంట్ సెంటర్లలో విస్తరించడం ద్వారా ఆన్-ఎయిర్, డిజిటల్, ఆన్-గ్రౌండ్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ కార్యక్రమం విస్తరించనుంది. హిందీ, మరాఠీ, బంగ్లా, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోని నిబద్ధత కలిగిన రైటర్స్ కోసం ఈ ప్రోగ్రాం క్రియేట్ చేశారు. రచయితలు వారి ఊహ, నిర్మాణం, కథన నైపుణ్యం పెంపొందించుకునే దిశగా, రైటర్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టే అపూర్వ అవకాశం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ఇలా రిజిస్టర్
70 మంది కొత్త రచయితలు, 30 మంది వర్థమాన నిపుణులను ఈ ప్రోగ్రామ్ కు ఎంపిక చేస్తారు. టీవీ, ఓటీటీ, సినిమాల్లో ‘జీ’కి అవసరమైన కంటెంట్ రాసేలా వీళ్లను తీర్చిదిద్దుతారు. ఎన్‌రోల్ చేసుకోవడానికి www.zeewritersroom.com వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- ఈ వెబ్ సైట్ లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న వాళ్లకు పరీక్ష నిర్వహిస్తారు.
- టెస్టులో ప్రతిభ ఆధారంగా ఇందులో నుంచి టాప్ 10 శాతం మందిని రీడింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది.
- షార్ట్ లిస్ట్ చేసిన వాళ్లకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సినీ ఇండస్ట్రీకి చెందిన నిపుణుల ప్యానెల్ ఇంటర్వ్యూ చేపడుతుంది.
- చివరగా 100 మందిని సెలక్ట్ చేస్తారు. టాప్ 100 మంది జీ రైటర్స్ రూమ్‌లోకి ప్రవేశిస్తారు. ఇక్కడ వాళ్లు నిపుణుల మార్గదర్శకత్వంలో కథా ఆలోచనలకు మెరుగులు దిద్దుతారు.
ఈ కార్యక్రమం గురించి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్‌సూర్ మాట్లాడుతూ ..‘‘భారతదేశంలోని ప్రముఖ రైటర్స్ లో ఒకరిగా మారేందుకు ఇది మేము అందిస్తున్న అవకాశం మాత్రమే కాదు. భవిష్యత్తు తరం రచయితల ప్రతిభను పెంపొందించే మా కర్తవ్యం కూడా ఇందులో భాగమే. జీలో మా అతిపెద్ద బలం మా కథనాలు మాత్రమే కాదు, మేము గుర్తించి, అవకాశం ఇచ్చే కథకులు కూడా అని మేము విశ్వసిస్తున్నాము. జీ రైటర్స్ రూమ్‌తో సరికొత్త స్వరాలు, ఇప్పటికింకా చెవినపడని ఆలోచనలు, నిజాయితీ కలిగిన భావోద్వేగాలు రూపం సంతరించుకునే ప్రదేశాన్ని మేము సృష్టిస్తున్నాము’’ అని అన్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



