రేపే జీ తెలుగు బ్లాక్ బస్టర్ బోనాలు.. జోగిని శ్యామలతో ఎల్లమ్మ కథ.. శంకర్ దాదాగా ఆర్కే రోజా, ఏటీఎమ్‌గా హీరో శ్రీకాంత్
జీ తెలుగులో బ్లాక్ బస్టర్ బోనాలు కార్యక్రమాన్ని రేపు (జులై 20) ప్రసారం చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్, హీరోయిన్ రోజా నాయకత్వంలో సీరియల్ నటీనటులు రెండు టీమ్స్‌గా పాల్గొననున్నారు. అలాగే, ఎల్లమ్మ కథను జోగిని శ్యామల అందరి మనసుకు హత్తుకునేలా చెప్పనున్నారు.
వినోదభరితమైన కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. ఆసక్తికరమైన మలుపులతో సాగుతున్న సీరియల్స్‌తో పాటు సరికొత్త కాన్సెప్ట్స్‌తో నాన్ ఫిక్షన్ షోలతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ప్రత్యేక సందర్భాలను మరింత ప్రత్యేకంగా మలిచేందుకు ఎప్పుడూ ముందుండే జీ తెలుగు మరో ఈవెంట్‌తో సందడి చేయనుంది.
బోనాల సందర్భంగా
బోనాల సందర్భంగా మరో ప్రత్యేక కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రానుంది జీ తెలుగు. తెలంగాణ బోనాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ‘బ్లాక్‌బస్టర్ బోనాలు’ జూలై 20న ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేయనున్నారు.
యాంకర్స్‌గా రవి, వర్షిణి
జీ తెలుగు నటీనటుల ఆటపాటలు, అల్లరితో సందడిగా సాగిన ఈ కార్యక్రమానికి యాంకర్ రవి, వర్షిణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. సంప్రదాయం, సంస్కృతి మేళవింపుతో ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు, హాస్య సన్నివేశాలు, వినోదాత్మక స్కిట్‌లు, మధురమైన పాటలతోపాటు మరెన్నో వినోదం పంచే కార్యక్రమాలతో ఆకట్టుకోనున్నారు.
శ్రీకాంత్-రోజా నాయకత్వంలో
జీ తెలుగులో ప్రసారమయ్యే మధ్యాహ్నం, ప్రైమ్‌టైమ్ సీరియల్స్ నటీనటులు అంతా హీరో శ్రీకాంత్, సీనియర్ హీరోయన్, నటి ఆర్కే రోజా నాయకత్వంలో రెండు టీమ్స్‌గా ఏర్పడి పోటీపడనున్నారు. ఈ కార్యక్రమంలో జీ తెలుగు నటీనటులతోపాటు జోగిని శ్యామల దేవత ఎల్లమ్మ కథను హృదయాలకు హత్తుకునేలా ఆవిష్కరించనున్నారు.
అఖండ పాత్రను
"హగ్ చేస్కో, సాంగ్ గెస్ చేస్కో" అనే ఆటతో అంత్యాక్షరి ఆటతో ప్రేక్షకులను అలరిస్తారు. శ్రీకాంత్ తన సూపర్ హిట్ సినిమా "ప్రేయసిరావే"లోని గాజులు విసిరే సన్నివేశాన్ని పునఃసృష్టించనున్నారు. డ్రామా జూనియర్స్ పిల్లలు బాలకృష్ణ "అఖండ" పాత్రను హాస్యాస్పదంగా అనుకరించి కడుపుబ్బా నవ్వించనున్నారు.
శంకర్ దాదాగా రోజా
రోజా చిరంజీవి శంకర్ దాదా పాత్రలో, శ్రీకాంత్ తన ఏటీఎం పాత్రలో అదరగొడుతూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తారు. మధ్యాహ్నం, ప్రైమ్‌టైమ్ సీరియల్స్ హీరోయిన్‌ల మధ్య జరిగే నృత్య పోటీ వేదికను ఉర్రూతలూగిస్తుంది.
జీ తెలుగు బోనాలు
చిన్నారులు రాయన్, కుషి తమ పాటలతో అందరి మనసులను గెలుచుకుంటారు. బోనాలు సందర్భంగా మహిళా కళాకారులకు గాజులు పంచడం తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తుచేస్తుంది. వైభవంగా జరిగిన ఈ జీ తెలుగు బ్లాక్ బస్టర్ బోనాలు కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూసేయండి అంటూ మేకర్స్ ప్రకటించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



