ప్రముఖ తెలుగు ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగులోకి సోమవారం (జులై 14) నుంచి ఓ కొత్త సీరియల్ వస్తోంది. ఈ సీరియల్ పేరు జయం. గత వారమే గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ఇప్పుడు తొలి ఎపిసోడ్ కు సిద్ధమైంది. ప్రేమ, పట్టుదల, బాధ్యతల మధ్య సాగే ప్రేమకథ అంటూ ఈ సీరియల్ ను ఆ ఛానెల్ ప్రమోట్ చేస్తోంది.
జయం సీరియల్ టైమ్ ఇదే

జీ తెలుగులోకి వస్తున్న సీరియల్ పేరు జయం. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ఈరోజు (జులై 14) నుంచే ప్రారంభం కాబోతోంది. ఈ సీరియల్ ను జీ తెలుగు ఛానెల్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది. శ్రీరామ్ వెంకట్, వర్షిణిలాంటి వాళ్లు నటించిన ఈ సీరియల్ పై భారీ ఆశలే పెట్టుకుంది. ఓ స్ఫూర్తివంతమైన కథతో రాబోతున్న సీరియల్ ఇది.
జయం సీరియల్ స్టోరీ ఇదే..
జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్ (శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి(వర్షిణి) జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా.. పేదరికం, తల్లి అనారోగ్యం, తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా? గతాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలరా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ జయం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే.
ఆ రెండు సీరియల్స్ టైమ్ మార్పు
జీ తెలుగులోకి కొత్త సీరియల్ వస్తుండటంతో ఇప్పటికే ప్రసారమవుతున్న రెండు సీరియల్స్ టైమింగ్ మారిపోయింది. సోమవారం (జులై 14) నుంచి చామంతి, జగద్ధాత్రి సీరియల్స్ టైమింగ్ మారిపోనుంది. ఇక నుంచి సోమవారం నుంచి శనివారం వరకు చామంతి సీరియల్ ప్రతి రోజు రాత్రి 8.30 గంటలకు ప్రసారం అవుతుంది. గతంలో ఇది 8 గంటలకు వచ్చేది. ఇక జగద్ధాత్రి సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇప్పటి వరకూ ఈ సీరియల్ 8.45కు ప్రారంభమయ్యేది.
టీఆర్పీ రేటింగ్స్ విషయంలో స్టార్ మా ఛానెల్ తో పోలిస్తే జీ తెలుగు సీరియల్స్ వెనుబడి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్ సరికొత్త సీరియల్స్ తోపాటు ప్రస్తుతం ఉన్న సీరియల్స్ టైమింగ్స్ ను కూడా మారుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
{{/usCountry}}టీఆర్పీ రేటింగ్స్ విషయంలో స్టార్ మా ఛానెల్ తో పోలిస్తే జీ తెలుగు సీరియల్స్ వెనుబడి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్ సరికొత్త సీరియల్స్ తోపాటు ప్రస్తుతం ఉన్న సీరియల్స్ టైమింగ్స్ ను కూడా మారుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
{{/usCountry}}