ఓటీటీలోకి ఎప్పుడు విభిన్న కంటెంట్‌తో సినిమాలు వస్తూ అలరిస్తుంటాయి. వాటిలో కొన్ని అతి తక్కువ సమయంలోనే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంటాయి. అది కూడా కొద్దిరోజులపాటు ట్రెండింగ్‌లో టాప్ ప్లేసులోనే ఉంటాయి. అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ మూవీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలో మూడు రోజులుగా ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్.. రిలీజ్ డే నుంచే టాప్‌లో.. 17 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
మనుషులను పీక్కుతునే జాంబీలు
ఆ హారర్ థ్రిల్లర్ సినిమా పేరే జియామ్. థాయ్ భాషకు చెందిన జాంబీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమానే జియామ్. ఓ వైరస్ వల్ల మనుషులు చనిపోయి మళ్లీ బతికి ఇతర మనుషులను పీక్కుతినేవాళ్లనే జాంబీలు అంటారు. జాంబీ కాన్సెప్ట్‌తో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి.
వివిధ ఎలిమెంట్స్‌తో
ఈ జాంబీ కాన్సెప్ట్‌కో కామెడీ, యాక్షన్, ఫాంటసీ, ఎమోషనల్, హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మరింత రసవత్తరంగా తెరకెక్కిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల మూడు రోజుల క్రితం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ సినిమా జియామ్.
ఎలా కాపాడాడు
కల్ప్ కల్జరీయాక్ దర్శకత్వం వహించిన జియామ్ సినిమాలో జానీ అన్ఫొనే, నుట్టనిచ దంగ్వాట్టనవనిచ్, మార్క్ ప్రిన్ సుప్రత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫైటర్ అయిన హీరో తన గర్ల్‌ఫ్రెండ్‌ను, ఆమెతో ఉన్న ఓ బాబును జాంబీల నుంచి ఎలా కాపాడు అనే ఇతివృత్తంతో జియామ్ సినిమా సాగుతుంది.
యాక్షన్ సీన్స్-రక్తపాతం
అయితే, స్టోరీలో పెద్దగా కొత్తదనం లేదు. కానీ, టేకింగ్ అదిరిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అదిరిపోయే యాక్షన్ సీన్స్, రక్తపాతం, హారిబుల్ సీన్స్ చాలానే ఉన్నాయని హాలీవుడ్ సైట్స్ నుంచి రివ్యూలు వచ్చాయి. జులై 9 నుంచి జియామ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇవాళ ఓటీటీ ట్రెండింగ్‌లో
నెట్ఫ్లిక్స్లో జులై 9న జియామ్ ఓటీటీ రిలీజ్ అయింది. అదే రోజు నుంచే ఓటీటీ ట్రెండింగ్ టాప్ 2లోకి వచ్చింది జియామ్. ప్రస్తుతం ఇవాళ (జులై 11) నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 4 ప్లేసులో జియామ్ నిల్చింది. ఇలా గత మూడు రోజుల నుంచి ట్రెండింగ్ టాప్‌లోనే జియామ్ అదరగొడుతోంది.
17 భాషల్లో
ఇక జియామ్ 17 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. థాయ్ భాషతోపాటు తమిళం, హిందీ, ఇంగ్లీష్, బ్రెజిలీయన్ పోర్చుగీస్, సీజెక్, యురోపియన్ స్పానిష్, ఫిలిపినో, ఫ్రెంచ్, జెర్మన్, హంగేరియన్, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోలిష్, స్పానిష్, టర్కిష్ ఇలా 17 భాషల్లో ఇంగ్లీష్, థాయ్, అరబిక్ సబ్ టైటిల్స్‌తో జియామ్ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.