ఓటీటీలోకి సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్.. రక్తపాతం, అదిరిపోయే యాక్షన్ సీన్స్.. నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్!
ఓటీటీలోకి సర్వైవల్ హారర్ జాంబీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జియామ్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. రెండు రోజుల్లో అంటే జూలై 9న నేరుగా జియామ్ ఓటీటీ రిలీజ్ కానుంది. కేవలం గంట 35 నిమిషాలు రన్ టైమ్ ఉండే జియామ్ సినిమాలో రక్తపాతం, అదిరిపోయే ఫైట్ సీన్స్‌తోపాటు ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఉన్నాయి.
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు విభిన్నమైన జోనర్స్‌లో డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రతివారం సరికొత్త కథనాలతో ఓటీటీ సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతుంటాయి. అలా, ఈ వారం కూడా ఓ స్పెషల్ మూవీ అలరించేందుకు సిద్ధంగా ఉంది.

ఒక వైరస్ వల్ల
ఆ సినిమానే జియామ్. ఇది ఒక సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అయితే, ఇది ఒక జాంబీ కాన్సెప్ట్ సినిమా. ఒక వైరస్ వల్ల మనుషులు మరో మనిషిని కిరాతకంగా చంపి తింటారు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు ఎన్నో ఓటీటీ సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి.
హారర్ సర్వైవల్ ఎలిమెంట్స్
వీటిలో స్టోరీ అన్నింట్లో లాగే సాధారణంగా ఉంటుంది. ఒక అవుట్ బ్రేక్ జరగడం (వైరస్ స్ప్రెడ్ అవడం), దాని నుంచి హీరో లేదా కుటుంబం, తనకు సంబంధించిన వాళ్లను కాపాడుకోవడం వంటి సీన్లతోనే కథ సాగుతుంది. అయితే, వాటిని ఎంత థ్రిల్లింగ్, హారర్, సర్వైవల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించామనేదాన్ని బట్టే ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
లవర్‌ను కాపాడుకునే ఫైటర్
ఇక జియామ్ సినిమా స్టోరీ కూడా దాదాపుగా అలాగే ఉందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఫైటర్ అయిన హీరో తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిన చోట ఓ వైరస్ వ్యాప్తి చెంది మనుషులంతా చనిపోతారు. చనిపోయిన మనుషులు ఇతర మనుషులను అతి ఘోరంగా చంపి తింటుంటారు. వారి నుంచి తన ప్రేయసిని ఆ ఫైటర్ ఎలా కాపాడుకున్నదే జియామ్ స్టోరీ అని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది.
జాంబీల మేకోవర్
అయితే, జియామ్ టేకింగ్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తోంది. జియామ్‌లో హీరో ఒక ఫైటర్ కావడం, జాంబీలతో ఫైట్ చేసే సర్వైవల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే, రక్తపాతం, హింస, ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో జియామ్ నిండిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో జాంబీల మేకోవర్ కూడా మిగతా సినిమాలతో పోలిస్తే చాలా భయంకరంగా ఉంది.
రెండు రోజుల్లో
జాంబీ హారర్ కాన్సెప్ట్‌తో వచ్చిన జియామ్‌ను చాలా వరకు మేకర్స్ కొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ హారర్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ జియామ్ ఓటీటీలోకి వచ్చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో జియామ్ ఓటీటీ రిలీజ్ కానుంది. అది కూడా మరో రెండు రోజుల్లో థాయి జాంబీ హారర్ మూవీ జియామ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా
అంటే, జులై 9 (బుధవారం) నుంచి నెట్ఫ్లిక్స్ఓటీటీలో థియేట్రికల్ రిలీజ్ లేకుండా డైరెక్ట్‌గా జియామ్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. అయితే, ఇప్పటివరకు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కేవలం థాయి భాషలోనే గంట 35 నిమిషాలు ఉన్న జియామ్ ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. ఆ తర్వాత తెలుగులో జియామ్ ఓటీటీలో అందుబాటులో ఉంటుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



