...
...
Next Story

అష్టదళ కమలం రంగోలి: దీపావళి పూజలో ఈ రంగోలి వేయండి.. అదృష్టం, సిరిసంపదలు మీ సొంతం

దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీదేవిని స్వాగతించడానికి పూజ గదిలో లేదా ఇంట్లో ఎక్కడైనా అష్టదళ కమలం లేదా ఎనిమిది రేకుల కమలం రంగోలి వేయడం అత్యంత శుభప్రదం. సంప్రదాయబద్ధంగా పూలు లేదా శుభప్రదమైన రంగులతో ఈ రంగోలి వేసి, సిరిసంపదలు, అదృష్టాన్ని ఆహ్వానించవచ్చు.

Published on: Oct 20, 2025 03:46 PM IST
Advertisement

దీపావళి వస్తుందంటే చాలు... ఇల్లంతా దీపాలతో, అలంకరణలతో మెరిసిపోవాల్సిందే. అలంకరణలలో రంగోలి లేనిదే పండుగ కళే ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద రంగురంగుల ముగ్గులు వేయడం ఎంత ముఖ్యమో, పూజ గదిలో కూడా రంగోలి వేయడం అంతకంటే ముఖ్యం.

అష్టదల కమలం రంగోలి: దీపావళి పూజలో ఈ రంగోలి వేయండి.. అదృష్టం, సిరిసంపదలు మీ సొంతం (PINTREST)
అష్టదల కమలం రంగోలి: దీపావళి పూజలో ఈ రంగోలి వేయండి.. అదృష్టం, సిరిసంపదలు మీ సొంతం (PINTREST)

అయితే, మామూలు డిజైన్ల కంటే దీపావళి పూజ కోసం ప్రత్యేకంగా ఒక డిజైన్‌ను వేయడం ఆనవాయితీగా వస్తోంది. అదే అష్టదళ కమలం (ఎనిమిది రేకుల తామరపువ్వు) రంగోలి.

అష్టదళ కమలం ఎందుకు అంత శుభప్రదం?

రంగోలి డిజైన్లలో చాలా రకాలు ఉన్నా, పూజ స్థలంలో ఎప్పుడూ అష్టదల కమలం ముగ్గునే వేయాలని పండితులు చెబుతుంటారు. దీని వెనుక బలమైన నమ్మకం ఉంది.

లక్ష్మీదేవి ఆసనం: సాక్షాత్తూ సిరిసంపదల దేవత అయిన మహాలక్ష్మి ఎనిమిది రేకులున్న కమలంపైనే కొలువై ఉంటుందని హిందువుల నమ్మకం. అందుకే దీపావళి రోజున పూజ చేసే చోట ఈ అష్టకమల ముగ్గును వేస్తే, అమ్మవారు సంతోషించి, మన ఇంట్లోకి అడుగుపెడతారని విశ్వసిస్తారు.

అష్టసిద్ధులు: ఈ ఎనిమిది రేకులు అష్టసిద్ధులకు (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వ) ప్రతీక అని కూడా చెబుతారు. అందుకే ఇది శుభానికి, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు.

రంగోలి వేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్య చిట్కాలు

మీరు లక్ష్మీదేవిని ఆహ్వానించే ఈ పవిత్రమైన ముగ్గును మరింత ప్రత్యేకంగా వేయడానికి ఈ చిట్కాలను పాటించండి:

పూలు వాడండి: సాధారణ రంగుల కంటే పూలను లేదా సున్నితమైన, శుభప్రదమైన సహజ రంగులను ఉపయోగించడం శ్రేయస్కరం. ఉదాహరణకు, బంతిపూలు (ఆరెంజ్, పసుపు), గులాబీలు, ఆకుపచ్చ రంగు ఆకులు వంటివి పూజ గది రంగోలికి చాలా అద్భుతంగా ఉంటాయి.

రంగులు వద్దు: మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులను పూజ గదిలో వేసే రంగోలి కోసం వాడకుండా ఉండటం మంచిది. సహజసిద్ధమైన, లేదా సంప్రదాయబద్ధంగా వాడే ముగ్గు పిండినే వాడండి.

లక్ష్మీ పూజ కోసం ఈ రంగోలి వేయండి
పూలతో రంగోలి

సరళమైన డిజైన్: సంక్లిష్టమైన డిజైన్ల కంటే, చాలా సరళంగా ఉండే సంప్రదాయ అష్టదళ కమల డిజైన్‌ను ఎంచుకోవడం, పూజ గదికి మరింత దైవత్వాన్ని తీసుకొస్తుంది.

అష్టాదళ కమల రంగోలి డిజైన్

పూజ చేసే స్థలం దగ్గర అష్టదళ కమలం ముగ్గు వేసి, దీపాలు వెలిగిస్తే... ఆ ఇల్లంతా ఓ అద్భుతమైన వైభవంతో వెలిగిపోతుంది. ఈ దీపావళికి మీరు కూడా ఈ పవిత్రమైన రంగోలిని వేసి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని కోరుకుందాం.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON