నాన్న ప్రేమను బాధ్యతలో చూడగలం.. ఇలా ఫాదర్స్ డే విషెస్ చెప్పండి
తల్లి జీవితాన్ని ఇస్తే.. ఆ జీవితానికి దారిచూపేవాడు నాన్న. మీకు వచ్చే ఎంతటి కష్టానికైనా ముందు నిలుచుంటాడు. అలాంటి తండ్రుల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ఉంది. జూన్ 15న ఫాదర్స్ డే. మీ నాన్నకు కొన్ని కోట్స్ షేర్ చేసి విషెస్ చెప్పండి.
బిడ్డను కడుపులో మోసేది తల్లి అయితే.. గుండెల మీద పెట్టుకుని జీవితాంతం చూసేవాడు తండ్రి. సాధారణంగా మన తండ్రి మనల్ని సముద్రమంత ప్రేమిస్తున్నా.. దానిని చూపించరు. కొంతమంది తండ్రులు తమ పిల్లలతో స్నేహితుల్లా ఉంటారు, మరికొందరు చాలా కఠినంగా ఉంటారు. వారు తమ పిల్లలను ప్రేమించరని కాదు, కానీ తమ ప్రేమను వ్యక్తపరిచే విధానం అది. ఒక కూతురు పెళ్లి చేసుకున్నప్పుడే తండ్రి ప్రేమ ఏంటో తెలుసుకుంటుంది. కొడుకు తండ్రి అయినప్పుడే తెలుసుకుంటాడు. తన పిల్లలు తాను కోరుకున్న విధంగా మంచి వ్యక్తులుగా ఎదిగితే, ఆ సంతృప్తి తండ్రి కళ్లలో కనిపిస్తుంది. జూన్ 15న ఫాదర్స్ డే జరుపుకొంటారు. ఇక్కడ కొన్ని కోట్స్ ఇచ్చాం. వీటి ద్వారా విషెస్ చెప్పండి.

బిడ్డ గెలిచినప్పుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి.. ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కరే.. హ్యాపీ ఫాదర్స్ డే
తప్పటడుగులు వేయకుండా.. ఎన్నడూ తడబడకుండా.. ఎప్పటికీ మనం కిందపడకుండా.. వెంట ఉండేవాడు నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే
మన ముందు కఠినంగా ఉండే నాన్న.. బయట వారికి, ముఖ్యంగా బంధువులకు మన గురించి గొప్పగా చెబుతాడు.. Happy Fathers Day
నా తల్లి నాకు జీవితాన్ని ఇచ్చింది.. నా తండ్రి జీవించడానికి కావాల్సిన ధైర్యాన్ని నాలో నింపాడు.. నా చేయి పట్టుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలనే ఆశను ఇచ్చాడు.. నన్ను మంచి వ్యక్తిగా మార్చినందుకు ధన్యవాదాలు నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే
నాన్న ఇప్పటికీ, ఎప్పటికీ.. నాకు ప్రాణ స్నేహితుడు.. నిన్ను కలిగి ఉండటం నా అదృష్టం.. హ్యాపీ ఫాదర్స్ డే
నువ్వు నాకు ఎలా జీవించాలో చెప్పలేదు, చూపించావు. నాకు జీవించే కళ నేర్పిన నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు
ఎవరైనా తండ్రి కావచ్చు, కానీ కొద్దిమంది మాత్రమే మంచి తండ్రి కాగలరు, వారిలో ఒకరు నువ్వే నాన్న. నువ్వు చాలా ప్రత్యేకమైనవాడివి, నువ్వు నాకు ఎలా బతకాలో నేర్పించావు.. హ్యాపీ ఫాదర్స్ డే
నువ్వు మా కోసం కార్చిన ప్రతి చెమట చుక్కకు ఏం చేసినా తక్కువే. నువ్వు మాకు దేవుడు ఇచ్చిన విలువైన బహుమతివి, నాన్న నువ్వు గర్వపడే కూతురిని అవుతాను.. ఇది నా ప్రామిస్.. Happy Father's Day
నా అభిమాన హీరో ఎవరు అని నన్ను ఎవరు అడిగినా, నేను వారికి చెబుతాను, నా జీవితంలో నేను చూసిన గొప్ప సూపర్ హీరో నా తండ్రి అని.. నాన్న మీ జీవితాన్ని నా కోసం అంకితం చేసినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.. హ్యాపీ ఫాదర్స్ డే
నేను పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు నీ భుజాలపై మోస్తూ ప్రపంచాన్ని చూపించావ్.. థాంక్యూ నాన్న.. Happy Father's Day 2025
అమ్మ ప్రేమను కళ్లతో చూడగలం.. నాన్న ప్రేమను బాధ్యతలో మాత్రమే చూడగలం.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper



