కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. ఇలా మీ ప్రియమైనవారికి విషెస్ చెప్పండి!

కార్తీక పౌర్ణమి హిందూ సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన పండుగ. ఈ మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున మీ ప్రియమైనవారికి విషెస్ చెప్పండి.

Published on: Nov 5, 2025, 04:51:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ మాసం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. హిందువుల పవిత్ర పండుగలలో ఒకటైన కార్తీక పౌర్ణమి నవంబర్ 5 అంటే ఈరోజే. ఈ పండుగను దేశవ్యాప్తంగా గొప్పగా నిర్వహిస్తారు. దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. దీనిని త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు. తులసి పూజ, శివారాధన చేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా విషెస్ చెప్పండి.

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

నాగేంద్రహారాయ త్రిలోచనాయ..

భస్మాంగరాగాయ మహేశ్వరాయ..

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ..

తస్మై న కారాయ నమఃశివాయ..

Happy Karthika Pournami 2025

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం..

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం..

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం..

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం..

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్

ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వ మామలేశ్వరం

పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరం

సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే

వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే

హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః

సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి

కార్తీక పూర్ణిమ శుభకాంక్షలు 2025

విష్ణువు, శివుడిని పూజించే ఈ ప్రత్యేక కార్తీక పూర్ణిమ రోజున దేవతల ఆశీస్సులు మీపై ఉండాలి. కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు

కార్తీక దీపంలాగే మీ జీవితంలో వెలుగులు నిండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..

కార్తీక దీపం ఇంటికి వెలుగునిస్తుంది.. మీరు మీ ఇంటికి, సమాజానికి వెలుగుగా మారాలని ఆశిస్తూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 2025

ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా శివయ్య ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. Happy Karthika Pournami 2025

చంద్రుని కాంతి మీకు, మీ ప్రియమైనవారికి ఆనందాన్ని కలిగించాలని.. నేను ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నాను. Happy Karthika Purnima 2025

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః । అందరి మదిలో కొలువైన విష్ణువు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అనుగ్రహించాలి. హ్యాపీ కార్తీక పూర్ణిమ

ఈ దీపోత్సవం మీ జీవితంలో అనేక వెలుగులను నింపాలని కోరుకుంటున్నాను.. హ్యాపీ కార్తీక పౌర్ణమి 2025

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం..

వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్..

నారదాది యోగిబృంద వందితం.. దిగంబరం..

కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

Happy Karthika Purnima 2025

కార్తీక పండుగ మీ జీవితంలో ఒక కొత్త యుగాన్ని ప్రారంభించి, మీ పోరాటాలపై విజయం, మీ బలహీనతల నుండి విముక్తి, మీరు కోరుకునే జీవితాన్ని అందించాలి. కార్తీక పూర్ణిమ నాడు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ కార్తీక పౌర్ణమి 2025

ఈ కార్తీక పూర్ణిమ, శివుడు మీ జీవితం నుండి అన్ని ప్రతికూలతలను తొలగిస్తాడు. ఆనందం, మంచి ఆరోగ్యం, సంపద, అదృష్టాన్ని మీ జీవితంపై కురిపిస్తాడు. మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.

Happy Karthika Pournami 2025

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More