...
...
Next Story

Ugadi Wishes Telugu : ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. ఆనందంగా గడపండి

Ugadi Wishes In Telugu: ఉగాది పండుక వచ్చేసింది. మీ ప్రియమైనవారికి ఉగాది శుభాకాంక్షలు పంపండి. మీ కోసం కొన్ని సందేశాలు ఇక్కడ ఉన్నాయి.

Updated on: Mar 18, 2026, 09:49:28 IST
By
Prefer HTon Google
Advertisement

హిందూ పంచాగం ప్రకారం 2026లో మార్చి 19న ఉగాది. కొత్తదనంతో ఉగాది రాబోతోంది. బాధ, దుఃఖం కలగలిసినదే జీవితం. ఉగాది పండుగ కూడా అదే విషయాన్ని చెబుతుంది. ఏ పండుగ వచ్చినా బంధువులు, స్నేహితులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అందరికీ శుభం, ఆరోగ్యం, సంపద, శాంతిని కలగాలని కోరుకుంటారు. ఉగాది శుభాకాంక్షలను మీ ప్రియమైనవారికి తెలియజేయండి.

  • కొత్త సంవత్సరానికి ప్రవేశిస్తున్నాం.., ఈ సంవత్సరం అందరి జీవితాల్లో కొత్తదనాన్ని నింపాలి. ఈ ఉగాది నుంచి జీవితంలో చేదు తగ్గి తీపి పెరగాలి. శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు
  • సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు
  • కొత్తదనంతో ఉగాది వచ్చేసింది.. ఈ ఉగాది ప్రతి ఒక్కరికీ కొత్త ఆనందాన్ని, జీవితంలో శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నారు.. Happy Ugadi
  • ఆనందంగా ఉన్నప్పుడు సంబరపడిపోవద్దు.. దుఃఖంలో ఉన్నప్పుడు కుంగిపోవద్దు.. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు
  • కొత్త సంవత్సరం మీ కలలన్నీ నెరవేరనివ్వండి.. మీరు అనుకున్నది సాధించాలి.. ఉగాది పండుగ శుభాకాంక్షలు
  • మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. జీవితంలో వేపలాంటి చేదు పోవాలని.., బెల్లంలాంటి తీపి పెరగాలని కోరుకుంటున్నాను.. Happy Ugadi 2026
  • కొత్త సంవత్సరం వచ్చేసింది.. ఈ సంవత్సరం మీ వృత్తి జీవితంలో పురోగతిని తీసుకురావాలని, మీ ఆర్థిక స్థితి బాగుండాలని, భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు
  • మీ జీవితంలో వేప చేదు కంటే బెల్లంలోని తీపి ఎక్కువగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. Happy ugadi
  • మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి, సామరస్యం ప్రవహించాలి.. ఉగాది శుభాకాంక్షలు
  • మనమందరం మన జీవితాలకు బలమైన పునాదిని కలిగి ఉండాలి.. ఈ కొత్త సంవత్సరం నుంచే అది మెుదలు కావాలి.. ఉగాది పండుగ శుభాకాంక్షలు
  • మీ అన్ని కొత్త కలలు నిజమవుతాయి.. శ్రీ పరాభవ నామ సంవత్సరం మీకు విజయాలను ఇవ్వాలి.. Happy Ugadi 2026
  • శ్రీ పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.. కొత్త సంవత్సరంలో మీకు సంతోషం, శాంతి, అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను.. సంవత్సరం మొత్తం ఆనందంతో నిండి ఉండాలి.. ఉగాది పండుగ శుభాకాంక్షలు
  • మీ చుట్టూ ఉన్న చీకటిని వెలుతురుగా మార్చండి.. ఈ ఉగాది మీ కుటుంబానికి ఆనందం ఇవ్వాలి, శాంతి, ప్రశాంతతను కలిగిస్తుందని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు
  • మీ వృత్తి జీవితంలో అభివృద్ధి చెందాలి.. ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి మీ వంతు కృషి చేయండి.. దేవుడు మీకు సమృద్ధిగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.. Happy Ugadi
  • కష్ట సుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం.. అదే ఉగాది పచ్చడి చెప్పే అసలు నిజం.. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు 2026
  • ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు Happy Ugadi 2026

ఉగాది శుభాకాంక్షలు
ఉగాది శుభాకాంక్షలు
 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON