Ugadi Wishes 2025: మీ ప్రియమైన వారికి పంపించేందుకు ఉగాది శుభాకాంక్షలు, సందేశాలు, కోట్స్ ఇవిగో
Ugadi Wishes 2025: ఉగాది వచ్చిందంటే బంధుమిత్రులతో సందడిగా ఇల్లు మారిపోతుంది. ఆ రోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు, మెసేజుల రూపంలో పంపిస్తారు. ఇక్కడ మేము తెలుగులోనే ఉగాది శుభాకాంక్షలు, సందేశాలు, కోట్స్ ఇచ్చాము.
ఉగాదిని భారతదేశంలో ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పండుగ హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగ రోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. అలాగే ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆ ఏడాదంతా మేలే జరగాలని కుటుంబానికి, స్నేహితులకు, సహోద్యోగులకు ఉగాది శుభాకాంక్షలు, సందేశాలను పంపిస్తారు. ఇక్కడ మేము తెలుగులోనే ఉగాది శుభాకాంక్షలు ఇచ్చాము. మీకు నచ్చినది ఎంపిక చేసుకొని మీరు ప్రియమైన వారికి పంపించండి.
ఉగాది శుభాకాంక్షలు (Wishmsg.com)
ఉగాది శుభాకాంక్షలు తెలుగులో
1. మీకు ఉగాది శుభాకాంక్షలు
ఈ నూతన సంవత్సరం
మీ జీవితానికి శాంతి, ఆనందం,
శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నా.
2. ఈ తెలుగు సంవత్సరాది
మీ జీవితంలో ఆరోగ్యాన్ని, సంపదను,
ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఉగాది శుభాకాంక్షలు
3. ఉగాది కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది.
ఈ ఏడాది మీ జీవితం మీరు కోరుకున్న విధంగా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉగాది
4. ఉగాదిలాంటి పవిత్రమైన రోజున
మీ కలలు నెరవాలని నేను ప్రార్థిస్తున్నాను.
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
5. ఉగాది కొత్త తెలుగు సంవత్సరం
ఇది కొత్త ఆశలను, కొత్త ఆకాంక్షలను,
కొత్త ప్రారంభాలను సూచిస్తుంది.
ఈ ఏడాది మీకు ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ
ఉగాది శుభాకాంక్షలు
6. ఈ కొత్త తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి
మీ ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను
ఈ రాబోయే సంవత్సరం మీకు సంపూర్ణంగా ఉండాలని మా కోరిక
హ్యాపీ ఉగాది
7. రాబోయే కొత్త తెలుగు ఏడాదిలో
మీకు అంతా మేలే జరగాలని
మీరు వేసే ప్రతి అడుగులో విజయం దక్కాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
8. ఈ ఉగాది నుంచే మీ జీవితం, శాంతి,
సామరస్యం, సానుకూలతతో నిండి ఉండాలని మా కోరిక
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
9. ఉగాది పండుగ మీ జీవితాల్లోకి
కొత్త ఆశలను, కొత్త లక్ష్యాలను తీసుకురావాలని కోరుకుంటూ
మీకు అద్భుతమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు
10. ఈ అందమైన ఉగాది రోజున
మీ హృదయం ఆనందంతో నిండి ఉండాలని
మీ జీవితంలో విజయాలు ఎదురవ్వాలని కోరుకుంటున్నాను
మీకు ఉగాది శుభాకాంక్షలు
11. ఈ ఉగాది మీ జీవితంలోకి
కొత్త వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీకు శాంతి, ప్రేమ, సమృద్ధిగా దొరకాలని ఆశిస్తున్నాను
హ్యాపీ ఉగాది
12. మీకు ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన
జీవితాన్ని ఈ ఉగాది ఇవ్వాలని కోరుకుంటున్నాను.
నూతన సంవత్సరం మీకు అంతులేని అవకాశాలను,
సమృద్ధిగా ఆనందాన్ని తెస్తుంది.
హ్యాపీ ఉగాది
13. ఉగాదిలోని ప్రకాశవంతమైన రంగులు
మీ జీవితాన్ని ప్రకాశంతో, సానుకూలతతో నింపుతాయి.
మీకు ఉగాది శుభాకాంక్షలు!
14. ఈ ఉగాది శుభ సందర్భంగా,
మీ కలలు వికసించాలి
మీ లక్ష్యాలు నెరవేరాలి.
ఉగాది శుభాకాంక్షలు!
15. ఈ ఉగాది మిమ్మల్ని మీ కలలకు దగ్గరగా తీసుకువెళ్లి,
కొత్త శిఖరాలకు చేరువ కావడానికి ప్రేరణనివ్వాలని కోరుకుంటున్నాను.