కురకురే దక్షిణ భారతదేశపు రిబ్బన్ పకోడీ ప్రేరణతో రూపొందిన స్నాక్‌తో ఇండియాలోని అనేక రుచులను వేడుకగా జరుపుకుంటోంది.

● దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన రిబ్బన్ పకోడీని తన ఉత్పత్తుల శ్రేణిలో చేర్చడం ద్వారా దక్షిణాది స్నాక్ విభాగంలోకి కురకురే విస్తరిస్తోంది.
● దక్షిణ భారతీయులకు సుపరిచితమైన రిబ్బన్ పకోడీ స్ఫూర్తితో రూపొందించిన కురకురే రిబ్బన్ పకోడీలో మూడు రకాల పప్పుధాన్యాలతో పాటు గుంటూరు మిరపకాయల ఘాటు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
● రూ.10, రూ.20 ధరల్లో లభించే కురకురే రిబ్బన్ పకోడీ దక్షిణ భారతదేశంలోని ప్రధాన మార్కెట్లలో స్థానిక కిరాణా దుకాణాల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ప్రచార చిత్రం లంక్:
విశాఖపట్నం, అక్టోబర్ 27, 2026: దక్షిణ భారతదేశంలో కొన్ని చిరుతిళ్లు కేవలం ఆకలి తీర్చుకునేందుకు తినే ఆహార పదార్థాలు మాత్రమే కావు. అవి చిన్ననాటి జ్ఞాపకాలతో, తరతరాలుగా ఆస్వాదిస్తున్నరుచులతో ముడిపడి ఉంటాయి. అలాంటి సుపరిచితమైన చిరుతిళ్లలో రిబ్బన్ పకోడీ ఒకటి. ప్రత్యేకమైన ఆకారం, కరకరలాడే స్వభావం, పిండిలో మిళితమైన సుగంధ ద్రవ్యాల రుచితో ఇది ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంట్లో డబ్బాల్లో దాచిపెట్టుకునే చిరుతిండి నుంచి సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించే స్నాక్ వరకు రిబ్బన్ పకోడీకి దక్షిణ భారతదేశంలోని తరతరాల వినియోగదారులతో ప్రత్యేక అనుబంధం ఉంది.
{{/usCountry}}విశాఖపట్నం, అక్టోబర్ 27, 2026: దక్షిణ భారతదేశంలో కొన్ని చిరుతిళ్లు కేవలం ఆకలి తీర్చుకునేందుకు తినే ఆహార పదార్థాలు మాత్రమే కావు. అవి చిన్ననాటి జ్ఞాపకాలతో, తరతరాలుగా ఆస్వాదిస్తున్నరుచులతో ముడిపడి ఉంటాయి. అలాంటి సుపరిచితమైన చిరుతిళ్లలో రిబ్బన్ పకోడీ ఒకటి. ప్రత్యేకమైన ఆకారం, కరకరలాడే స్వభావం, పిండిలో మిళితమైన సుగంధ ద్రవ్యాల రుచితో ఇది ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంట్లో డబ్బాల్లో దాచిపెట్టుకునే చిరుతిండి నుంచి సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించే స్నాక్ వరకు రిబ్బన్ పకోడీకి దక్షిణ భారతదేశంలోని తరతరాల వినియోగదారులతో ప్రత్యేక అనుబంధం ఉంది.
{{/usCountry}}అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా వినియోగదారులకు తాము చిన్నప్పటి నుంచి ఆస్వాదించిన సంప్రదాయ చిరుతిళ్లు, సుపరిచితమైన రుచులు ఎల్లప్పుడూ సులభంగా అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన పెప్సికో ఇండియాకు చెందిన ప్రముఖ స్వదేశీ బ్రాండ్ కురకురే®, దక్షిణ భారతదేశంలో ఎంతో ఆదరణ పొందిన రిబ్బన్ పకోడీ స్ఫూర్తితో, తనదైన ప్రత్యేక రుచిని జోడించి రూపొందించిన సరికొత్త కురకురే® రిబ్బన్ పకోడీని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రాంతీయ రుచులకు ప్రాధాన్యమిస్తూ చేపట్టిన నూతన ఆవిష్కరణల్లో భాగంగా ఈ ఉత్పత్తిని పరిచయం చేసింది.
రిబ్బన్ పకోడీని ఎంపిక చేసుకోవడం వెనుక వినియోగదారుల అభిరుచులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అవగాహన ఉంది. చిరుతిళ్ల విషయానికి వస్తే కొత్తదనంతో పాటు సుపరిచితమైనరుచులకు కూడా వినియోగదారులు అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఈ రెండు అంశాలను మేళవిస్తూ కురకురే® రిబ్బన్ పకోడీని రూపొందించారు. బియ్యపు పిండితో పాటు మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు అనే మూడు రకాల పప్పుధాన్యాలను ఉపయోగించి దీన్ని తయారు చేశారు. పిండిలో నువ్వులు, మిరియాలు కలపడం ద్వారా ప్రత్యేకమైన రుచిని అందించారు. దీనికి అదనంగా గుంటూరు మిరపకాయల ఘాటును జోడించి మరింత కారమైన రుచిని తీసుకొచ్చారు. రైస్ బ్రాన్ ఆయిల్‌తో తయారు చేసిన ఈ స్నాక్‌లో పామాయిల్‌ను ఉపయోగించలేదు. అలాగే కృత్రిమ రంగులు, కృత్రిమ ఫ్లేవర్లను జోడించలేదు. కరకరలాడే ప్రతి రిబ్బన్ పకోడీలో దక్షిణ భారతదేశపు సంప్రదాయ చిరుతిండి రుచితో పాటు కురకురే®కు ప్రత్యేకమైన సరదా, ఉత్సాహభరితమైన అనుభూతిని అందించేలా రూపొందించారు.
ఈ సందర్భంగా పెప్సికో ఇండియా కురకురే® మార్కెటింగ్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ మాట్లాడుతూ, “దక్షిణ భారతదేశంలోని వినియోగదారులు తమ ఆహార సంప్రదాయాల పట్ల ఎంతో గర్వంగాఉంటారు. అలాంటి సంప్రదాయ చిరుతిళ్లలో రిబ్బన్ పకోడీ ఒకటి. ఇది వారికి సుపరిచితమైన రుచులను, చిన్ననాటి జ్ఞాపకాలను, ఆనందాన్ని గుర్తుచేస్తుంది. పూర్తి స్వదేశీ బ్రాండ్‌గా కురకురే® భారతదేశంలోని విభిన్న ఆహార సంస్కృతులను వేడుకగా జరుపుకునేందుకు నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. కురకురే® రిబ్బన్ పకోడీ ద్వారా దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ చిరుతిండి నుంచి స్ఫూర్తి పొంది, దానికి కురకురే® ప్రత్యేకతను జోడించి సరికొత్త రూపంలో వినియోగదారులకు అందిస్తున్నాం. ప్రాంతీయ రుచుల స్ఫూర్తితో వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తూ, వినియోగదారులకు కొత్తదనంతో పాటు తమ ప్రాంతానికి చెందిన అసలైన రుచులను అందించాలనేమా నిబద్ధతకు ఈ ఆవిష్కరణ నిదర్శనం” అని తెలిపారు.
ఈ ఆలోచనే కురకురే® రిబ్బన్ పకోడీ విడుదల సందర్భంగా రూపొందించిన ప్రచార కార్యక్రమానికికూడా ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. సంప్రదాయ చిరుతిళ్లు అనగానే అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇంట్లో తయారు చేసే వంటకాలు, వాటితో ముడిపడిన మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అలాంటి సుపరిచితమైన రుచులను ఇంట్లో మళ్లీ తయారు చేసుకోవడం ఎల్లప్పుడూ సులభం కాదు. ఈ జ్ఞాపకాలకు కురకురే® తనదైన సరదా శైలిని జోడించింది. రిబ్బన్ పకోడీని ఒక్కసారి రుచి చూడగానే, దాన్ని స్వయంగా అమ్మమ్మే తయారు చేసినట్టుగా అనిపిస్తే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన ఆలోచనతో ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది.
దక్షిణ భారతీయ సినిమాల్లో కనిపించే ఉత్కంఠభరితమైన పోలీస్ కథా నేపథ్యంతో రూపొందించిన ఈ ప్రచార చిత్రం, ఉత్పత్తి ఆవిష్కరణను సుపరిచితమైన రుచి, కరకరలాడే అనుభూతికి సంబంధించిన వినోదభరితమైన వేడుకగా మలచింది. ఈ ప్రచార కార్యక్రమం కన్నడ భాషలో టెలివిజన్, డిజిటల్ మాధ్యమాల్లో ప్రసారం కానుంది. అలాగే తమిళం, తెలుగు భాషల్లో డిజిటల్ మాధ్యమాల ద్వారా వినియోగదారులకు చేరువ కానుంది. తద్వారా ఆయా ప్రాంతాల వినియోగదారులకు వారి మాతృభాషల్లోనే ఈ ప్రచార సందేశాన్ని అందించనున్నారు.
భారతదేశంలోని విభిన్న ప్రాంతాల ఆహార అభిరుచులు, సంస్కృతుల స్ఫూర్తితో ప్రాంతీయ చిరుతిళ్ల అనుభూతులను వినియోగదారులకు అందించాలనే కురకురే® దీర్ఘకాలిక ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త ఉత్పత్తిని విడుదల చేశారు. కురకురే® రిబ్బన్ పకోడీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని స్థానిక కిరాణా దుకాణాల్లో అందుబాటులోకి రానుంది. 28 గ్రాముల ప్యాక్ రూ.10కు, 56 గ్రాముల ప్యాక్ రూ.20కు లభించనుంది.
గమనిక: ఈ కథనాన్ని బ్రాండ్ తరఫున హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో రూపొందించింది. దీనిలో హిందుస్తాన్ టైమ్స్ సంపాదకీయం లేదా జర్నలిస్టుల బృందం భాగస్వామ్యం కాలేదు.
Want to get your story featured as above? click here!