...
...
Next Story

Love Songs Lyrics : ఈ వాలెంటైన్స్ డేకి ఈ పాటలతో సర్‌ప్రైజ్ చేయండి

Valentines Day Songs : వాలెంటైన్స్ డే రోజున మీ ప్రియమైన వారిని సర్ ప్రైజ్ చేయండి. కొన్ని ప్రేమ పాటలను వారికి అంకితం చేయండి..

Published on: Feb 11, 2024, 17:00:16 IST
By
Prefer HTon Google
Advertisement

వాలెంటైన్స్ డే రోజున మీ ప్రియమైన వారికి కొన్ని పాటలను అంకితం చేయండి. చాలా సంతోషంగా ఫీలవుతారు. అయితే మీరు స్వయంగా ఈ పాటలను పాడి వారికి పంపించొచ్చు. లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తితో కలిసి దిగిన ఫొటోలతో వీడియో ఎడిటింగ్ చేసి పంపొచ్చు. ఈ పాటల లిరిక్స్ మీ ప్రియమైన వారి మనసును హత్తుకుంటాయి. ఈ లవ్ సాంగ్స్ లిరిక్స్ మీ కోసం..

సీతారామమ్ సినిమాలోని పాట

వాలెంటైన్స్ డే కోసం పాటలు (Twitter)
వాలెంటైన్స్ డే కోసం పాటలు (Twitter)

ఓ సీతా వదలనిక తోడౌతా

రోజంతా వెలుగులిడు నీడౌతా

దారై నడిపేనే చేతి గీత

చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత

నుదుట తిలకమై వాలుతా

కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా

హై రామా ఒకరికొకరౌతామా

కాలంతో కలిసి అడుగేస్తామా

రేపేం జరుగునో రాయగలమా

రాసే కలములా మారుమా

జంటై జన్మనే గీయగలమా

గీసే కంచెనే చూపుమా

మెరుపులో ఉరుములా దాగుంది నిజము చూడమ్మా

ఓ సీతా వదలనిక తోడౌతా..

హై రామా ఒకరికొకరౌతామా

నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై

నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై

ఓ వైపేమో ఓపలేని మైకం

లాగుతోంది మరోవైపు లోకం

ఏమి తోచని సమయమో

ఏది తేల్చని హృదయమో

ఏమీ బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో

నిదుల లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే

నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే

ఎపుడూ లేదో ఏతో వింత బాధే

వంత పాడే క్షణం ఎదురాయే

కలిసొస్తావా ఓ కామమా

కలలు కునుకులా కలుపుమా

కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా

కాలంతో కలిసి అడుగేస్తామా

దారై నడిపెనే చేతి గీత

చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత

నుదుట తిలకమై వాలుతా

కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా..

బేబీ సినిమాలోని పాట

ఏం మాయే ఇది ప్రాయమా

అరె ఈ లోకమే మయమా

వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో

వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో

ఇద్దరిది ఒకే ప్రయాణంగా

ఇద్దరిది ఒకే ప్రపంచంగా

ఆ ఇద్దరిది ఊపిరి ఒకటయింది

మెల్లగా మెల్లగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా

దూకాయి వానలాగా

ఆ వాన వాలు ఏ వైపుకో

తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా

దూకాయి వానలాగా

ఆ వాన వాలు ఏ వైపుకో

తేల్చేది కాలమేగా

తోచిందే ఈ జంట

కలలకే ఏ ఏ ఏఏ నిజములా ఆ ఆ

సాగిందే దారంతా

చెలిమికే ఏ ఏ ఏ రుజువులా ఆ ఆ

కంటీ రెప్ప కనుపాపలాగ

ఉంటారేమ కడదాక

సందామామ సిరివెన్నెల లాగ

వందేళ్లయిన విడిపోక

ఓ రెండు ప్రేమ మేఘాలిలా

దూకాయి వానలాగా

ఆ వాన వాలు ఏ వైపుకో

తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా

దూకాయి వానలాగా

ఆ వాన వాలు ఏ వైపుకో

తేల్చేది కాలమేగా

ఏ మాయే ఇది ప్రాయమా

అరె ఈ లోకమే మయమా

వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో

వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో

ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా

ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా

ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది

మెల్లగా మెల్లగా

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON