Home Remedies for Cockroach : వంటగదిలో బొద్దింకల బెడదా....? ఈ నేచురల్ స్ప్రేతో చెక్ పెట్టండి…!
Cockroach Removal Hack : మార్కెట్లో దొరికే రసాయన స్ప్రేలు వాడకుండానే వంట గదిలోని బొద్దింకల సమస్యకు చెక్ పెట్టొచ్చు. లవంగాలు, బిర్యానీ ఆకులు, బేకింగ్ సోడాతో శాశ్వతంగా తరిమికొట్టొచ్చు.
Home Remedies for Insects : ఇంట్లో బొద్దింకలు ఉంటే కేవలం అసహ్యంగా ఉండటమే కాదు, అవి రకరకాల వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా వంటగది, బాత్‌రూమ్‌లలో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వీటిని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే స్ట్రాంగ్ కెమికల్ స్ప్రేలు వాడుతుంటారు, కానీ వాటి వాసన అందరికీ పడదు…! పైగా అవి ఆరోగ్యానికి అంత సురక్షితం కాదు. అందుకే, ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో బొద్దింకలను తరిమికొట్టే ఒక అద్భుతమైన చిట్కాను ‘చటోరి చెట్నా’ సూచించారు.

కావాల్సిన వస్తువులు:
- నీరు - ఒక గ్లాసు
- లవంగాలు - ఒక టేబుల్ స్పూన్
- బిర్యానీ ఆకులు (బే లీవ్స్) - రెండు
- బేకింగ్ సోడా (వంట సోడా) - ఒక టీస్పూన్
తయారీ విధానం:
- ముందుగా ఒక గిన్నెలో గ్లాసు నీటిని తీసుకుని వేడి చేయాలి.
- అందులో లవంగాలు, బిర్యానీ ఆకులు వేసి బాగా మరిగించాలి.
- నీటి రంగు మారిన తర్వాత, అందులో బేకింగ్ సోడా వేసి కలపాలి.
- ఈ మిశ్రమం చల్లారిన తర్వాత, వడకట్టి ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.
ఎలా ఉపయోగించాలి…?
బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలు అంటే.. సింక్ కింద, వంటగది మూలలు, డ్రైనేజీ పైపుల దగ్గర మరియు చెత్తబుట్టల చుట్టూ ఈ నీటిని చల్లాలి. రాత్రి పడుకునే ముందు ఈ స్ప్రేని వాడితే ఫలితం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బొద్దింకలు రాత్రి వేళల్లోనే ఎక్కువగా బయటకు వస్తాయి.
ఇది ఎలా పనిచేస్తుంది?
లవంగాలు, బిర్యానీ ఆకులకు ఒక రకమైన ఘాటైన వాసన ఉంటుంది. ఈ వాసన బొద్దింకలకు మరియు ఇతర చిన్న కీటకాలకు అస్సలు పడదు. ఈ స్ప్రే చల్లిన ప్రాంతాల నుంచి అవి త్వరగా పారిపోతాయి. ఇది పూర్తిగా సహజమైనది కాబట్టి ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నా ఎటువంటి ప్రమాదం ఉండదు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

