...
...
Next Story

Rama Rama Uyyalo Lyrics : రామ రామ ఉయ్యాలో.. కొత్త బతుకమ్మ పాట లిరిక్స్ చూడండి

Telangana Bathukamma Song Lyrics : తెలంగాణలో బతుకమ్మ పాటల్లో రామ రామ ఉయ్యాలో పాటలది ప్రత్యేకమైన స్థానం. రామ రామ ఉయ్యాలో అంటూ లిరిక్స్‌లో అనేక మార్పులతో పాటలు ఉన్నాయి. మీరు కూడా కొత్త లిరిక్స్‌తో ఈ పాట పాడేయండి.

Published on: Oct 7, 2026, 16:58:02 IST
Advertisement

ఆశ్వయుజ మాసాన ఉయ్యాలో

బతుకమ్మ పాట లిరిక్స్
బతుకమ్మ పాట లిరిక్స్

ఆకసాన వెన్నెలలు ఉయ్యాలో

తెలంగాణ పోరునేల ఉయ్యాలో

పండుగై మెరిసెనుగా ఉయ్యాలో!

గుమ్మడి పూలల్లా ఉయ్యాలో

తంగేడు తంగుల్లో ఉయ్యాలో

పట్టుకుచ్చుల విరులు ఉయ్యాలో

తల్లీ నిను కొలిచెదము ఉయ్యాలో!

రామ రామ ఉయ్యాలో

రామచంద్ర ఉయ్యాలో

సీతామహాదేవి ఉయ్యాలో

శ్రీరాముని తోడూగా ఉయ్యాలో!

వాగులు వంకల్లో ఉయ్యాలో

పారేటి జలకాన ఉయ్యాలో

గౌరమ్మను నిలిపితిమి ఉయ్యాలో

పసుపుకుంకుమల తోటి ఉయ్యాలో!

అక్కా చెల్లెండ్లంతా ఉయ్యాలో

ఒక్కటై వచ్చిరిగా ఉయ్యాలో

పట్టుచీరల వెలుగు ఉయ్యాలో

ముంగిట్లో కదలాడే ఉయ్యాలో!

చుట్టూ తిరుగుతు ఉయ్యాలో

చప్పట్ల తాళాన ఉయ్యాలో

పాటల పూదోట ఉయ్యాలో

పరవశించి పాడంగ ఉయ్యాలో!

పాలపిట్ట కూతలతో ఉయ్యాలో

చేలల్లో పసిడి పంట ఉయ్యాలో

మా యిండ్ల సిరులన్నీ ఉయ్యాలో

మెండుగా నింపవమ్మ ఉయ్యాలో!

సాంబ్రాణి ధూపాన ఉయ్యాలో

సత్తుపిండి నైవేద్యం ఉయ్యాలో

సల్లగా చూడవమ్మ ఉయ్యాలో

మా ఇంటి బతుకమ్మ ఉయ్యాలో!

రామ రామ ఉయ్యాలో

రామచంద్ర ఉయ్యాలో

మళ్ళీ రావమ్మా ఉయ్యాలో

మరలొచ్చే ఏడాదికి ఉయ్యాలో!

తెలంగాణ పల్లెల్లో ఎక్కువగా పడే మరో 2 బతుకమ్మ పాటల లిరిక్స్ మీ కోసం అందిస్తున్నాం. వాటిని చూసి ఈసారి పాడేయండి.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో

ఈడేకి వచ్చితివి ఉయ్యాలో

ఏమి కోరేవమ్మ ఉయ్యాలో

ఉత్తరాన ఉండు ఉయ్యాలో

ఉత్తమరాజు కూతురు ఉయ్యాలో

దక్షిణాన ఉండు ఉయ్యాలో

దాసరి రాజు కూతురు ఉయ్యాలో

వైభవంగా చేసే ఉయ్యాలో

చేనులోని పువ్వులు ఉయ్యాలో

చేరి కోసి తెచ్చిరి ఉయ్యాలో

గుమ్మడి తంగేడు ఉయ్యాలో

గుత్తులుగా పేర్చిరి ఉయ్యాలో

గౌరమ్మను చేసి ఉయ్యాలో

కోరికలు కోరిరి ఉయ్యాలో

సల్లంగా చూడమ్మ ఉయ్యాలో

సౌభాగ్యమియ్యమ్మ ఉయ్యాలో!

ఆకేసి పువ్వేసి చందమామ పాట

ఆకేసి పువ్వేసి చందమామ - ఒకటైంది గౌరమ్మ చందమామ

రెండేసి పువ్వులేసి చందమామ - రత్నాల గౌరమ్మ చందమామ

మూడేసి పువ్వులేసి చందమామ - ముచ్చటైన గౌరమ్మ చందమామ

నాలుగేసి పువ్వులేసి చందమామ - నాణ్యమైన గౌరమ్మ చందమామ

ఐదేసి పువ్వులేసి చందమామ - అందాల గౌరమ్మ చందమామ

ఆరేసి పువ్వులేసి చందమామ - ఆనంద గౌరమ్మ చందమామ

ఏడేసి పువ్వులేసి చందమామ - ఏడంతల గౌరమ్మ చందమామ

ఎనిమిదేసి పువ్వులేసి చందమామ - లక్ష్మీదేవి గౌరమ్మ చందమామ

తొమ్మిదేసి పువ్వులేసి చందమామ - తొలిసంధ్య గౌరమ్మ చందమామ

పదేసి పువ్వులేసి చందమామ - పదికాలాలు మమ్మేలు చందమామ!

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON