Vinayaka Chavithi Wishes 2024: వినాయక చవితి శుభాకాంక్షలు మీ స్నేహితులకు బంధువులకు తెలుగులో ఇలా అందంగా చెప్పండి
Vinayaka Chavithi Wishes 2024: వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కొటేషన్లు, మెసేజ్‌ల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము కొన్ని వినాయక చవితి శుభాకాంక్షలు ఇచ్చాము. వీటిని మెసేజ్‌లు, వాట్సాప్ స్టేటస్‌లలో షేర్ చేసుకోవచ్చు.
Vinayaka Chavithi Wishes 2024: గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి... ఈ పండుగ హిందువులకు ఎంతో ముఖ్యమైనది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అంగరంగ వైభవంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చతుర్థిగా నిర్వహించుకుంటారు. ఏటా భాద్రపద మాసం శుక్ల చతుర్ధి సమయంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఇంట్లోను వినాయకుడు కొలువుదీరుతాడు. అదరూ తమ స్థాయికి తగ్గట్టు నైవేద్యాలతో, పూలు, పండ్లతో, ధూప దీపాలతో పూజించి ఆశీస్సులను పొందుతారు.
వినాయక చవితి శుభాకాంక్షలు (Pexel)
ఎంతో మంది వినాయక చవితి శుభాకాంక్షలు ఉదయానే తమ స్నేహితులు బంధువులకు షేర్ చేస్తారు. సోషల్ మీడియా కాలంలో వాట్సాప్‌లో, ఇన్స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్, ట్విట్టర్ లో కూడా ఈ శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడతాయి. మీరు అందమైన వినాయక చవితి కొటేషన్లు, విషెస్, శుభాకాంక్షలు కోసం వెతుకుతున్నట్లయితే ఇక్కడ మేము కొన్ని ఇచ్చాము. తెలుగులోనే ఉన్న ఈ శుభాకాంక్షలు మీకు నచ్చిన వారికి మెసేజ్‌లు లేదా వాట్సాప్ లో పంపించుకోవచ్చు.
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More