AC Safety Tips Telugu : ఏసీలు ఎందుకు పేలుతాయి...? కూల్‌గా ఉండాలంటే ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!

AC Safety Tips Telugu : వేసవి తాపం నుంచి ఉపశమనం ఇచ్చే ఏసీలే ఒక్కోసారి మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి…? మనం చేసే చిన్న చిన్న తప్పులే ప్రాణాల మీదకు ఎలా వస్తాయో..? ఇక్కడ తెలుసుకోండి…..

Published on: May 3, 2026, 12:51:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AC Safety Tips Telugu : మండుతున్న ఎండల నుంచి ఇంటికి రాగానే ఏసీ ఇచ్చే చల్లని గాలి మన అలసటను తీరుస్తుంది. కానీ….. అదే ఏసీ మన అజాగ్రత్త వల్ల పేలిపోతే? ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఇటీవల ఢిల్లీలోని వివేక్ విహార్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు మనల్ని భయపెడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చిన్నారులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏసీ పేలుతుందా….? దానికి గల సాంకేతిక కారణాలేంటి….? మనం చేయకూడని తప్పులేవో ఇక్కడ చూద్దాం….

ఏసీ పేలుళ్లకు కారణాలు
ఏసీ పేలుళ్లకు కారణాలు

ఏసీలు ఎందుకు పేలుతాయి…?

సాధారణంగా ఏసీ పేలుడు అనేది ఒక్క క్షణంలో జరిగేది కాదు. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సాంకేతిక లోపాలు, 'ఓవర్ హీటింగ్' (అధికంగా వేడెక్కడం) లేదా విద్యుత్ లోపాలు దీనికి ప్రధాన కారణం. అవుట్ డోర్ యూనిట్‌కు గాలి ఆడే సౌకర్యం లేకపోవడం, ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోవడం వల్ల వేడి బయటకు వెళ్లలేక యూనిట్ లోపల ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఏసీలో వాడే ఆర్-32 వంటి గ్యాస్ లీకై, ఏదైనా చిన్న స్పార్క్ తగిలితే అది భారీ మంటలకు దారితీస్తుంది.

మనం చేసే 5 ప్రధాన తప్పులు:

  1. సర్వీసింగ్ నిర్లక్ష్యం : "గతేడాదే కదా కొన్నాం.. ఇప్పుడే సర్వీస్ అవసరమా?" అని చాలా మంది అనుకుంటారు. ఏసీ కొత్తదైనా, పాతదైనా ప్రతి వేసవి ప్రారంభంలో సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. సర్వీస్ చేయకపోతే లోపల దుమ్ము పేరుకుపోయి మెషిన్ మీద లోడ్ పెరుగుతుంది.
  2. నాణ్యత లేని వైరింగ్ : ఏసీ అనేది భారీ విద్యుత్తును వినియోగించుకునే పరికరం. దీనికి నాణ్యమైన కేబుల్స్, విడిగా ఎంసీబీ (MCB) ఉండాలి. పాతబడిన వైరింగ్ లేదా వదులుగా ఉన్న కనెక్షన్ల వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించి పేలుడుకు దారితీస్తుంది.
  3. నాన్-స్టాప్ వాడకం : ఏసీని గంటల తరబడి, అది కూడా విరామం లేకుండా వాడటం వల్ల కంప్రెసర్ తీవ్రంగా వేడెక్కుతుంది. అది మెషిన్ మాత్రమే.. రోబో కాదు అని గుర్తించాలి. మధ్యమధ్యలో ఏసీకి కాసేపు విరామం ఇవ్వడం వల్ల దాని ఆయుష్షు పెరగడమే కాకుండా ప్రమాదాలు తప్పుతాయి.
  4. అవుట్ డోర్ యూనిట్ స్థలం : అవుట్ డోర్ యూనిట్‌ను నేరుగా ఎండ తగిలే చోట లేదా గాలి ఆడని ఇరుకైన బాల్కనీల్లో ఉంచకూడదు. వేడి గాలి బయటకు వెళ్లేందుకు తగినంత ఖాళీ ప్రదేశం ఉండాలి.
  5. గ్యాస్ లీకేజీని గుర్తించకపోవడం : ఏసీ నుంచి చల్లని గాలి రాకపోవడమో లేదా ఏదైనా వింత వాసన, వింత చప్పుడు వస్తున్నా వెంటనే మెకానిక్‌ను పిలవాలి. గ్యాస్ లీకేజీని నిర్లక్ష్యం చేస్తే అది మంటలు వ్యాపించడానికి కారణమవుతుంది.

సురక్షితంగా ఉండటానికి చిట్కాలు:

  • తక్కువ ఉష్ణోగ్రత (ఉదాహరణకు 16 డిగ్రీలు) వద్ద ఏసీని ఎక్కువ సేపు ఉంచకండి. 24-26 డిగ్రీలు ఆరోగ్యానికి మరియు ఏసీకి మంచిది.
  • ఏసీ కోసం నాణ్యమైన స్టెబిలైజర్‌ను వాడాలి.
  • నెలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి.
  • ఏదైనా అసాధారణమైన శబ్దం వినబడితే వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More