Dasara 2024 Wishes in Telugu: దసరా పండుగ హిందువులు నిర్వహించుకునే అతిపెద్ద వేడుకల్లో ఒకటి. దేశమంతా ఉన్న హిందువులు దసరాను వైభవంగా నిర్వహించుకుంటారు. శ్రీ దుర్గా దేవిని అమ్మవారిని తొమ్మిది అలంకారాల్లో దర్శించి ధరిస్తారు. దసరా పండుగ రోజు కచ్చితంగా తమ స్నేహితులకు, బంధువులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇక్కడ మేము కొన్ని విషెస్‌ను తెలుగులో అందించాము. ఈ శుభాకాంక్షలు మీరు వాట్సాప్, మెసేజ్‌లు, సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన దసరా శుభాకాంక్షలు ఎంపిక చేసుకొని మీ ఆప్త మిత్రులకు, బంధువులకు పంపించండి. అందరూ దసరాని సంతోషంగా నిర్వహించుకోవాలని కోరుకోండి.
దసరా 2024 శుభాకాంక్షలు

{{^htLoading}} {{/htLoading}}
1. తన బిడ్డల పట్ల చల్లని తల్లి
ఆకలి కొన్న వారి కడుపు నింపే అన్నపూర్ణ
లాలించే పాలించే భ్రమరాంబ
తప్పు చేస్తే దండించే దుర్గ
మహిషాసురులను మర్ధించే మహంకాళి
అమ్మలగన్నయమ్మ నేటి పెద్దమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
మనల్ని అందరినీ తన ఒడిలో పెట్టుకుని
కాపాడాలని కోరుకుంటూ విజయాన్ని ప్రసాదించాలని
కోరుతూ దసరా శుభాకాంక్షలు
2. దుర్గమ్మ ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటూ
సకల శుభాలు కలగాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు
3. అసత్యం పై సత్యం సాధించిన విజయం
అధర్మం పై ధర్మం సాధించిన విజయం
అధైర్యం పై ధైర్యం సాధించిన విజయం ఈ దసరా
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
4. మీ అందరి జీవితాలు సుఖసంతోషాలతో
నిండేలా చూడాలని ఆ కనకదుర్గమ్మను
వేడుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు
విజయదశమి శుభాకాంక్షలు
5. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి
మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని
దుర్గామాతను వేడుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
6. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందర వాసిని
కుమారి కాళీ కాపాలి కపిలే కృష్ణ పింగళి
భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే
చండీ చండీ నమస్తుభ్యం తారిణి వర వర్ణిని
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
7. ఎగిసే ఆశలతో విరిసే కోరికలతో
వినోదాలు జల్లులు పంచెను దసరా
ఆటపాటలతో అల్లుళ్ళ రాకతో
సరదాల సందడి తెచ్చెను దసరా
అమ్మవారి గాథలతో ఆయుధ పూజలతో
భక్తి పారవశ్యంలో ముంచెను దసరా
దుష్ట సంహారంతో శిష్ట రక్షణతో
విజయ కుసుమాలే కురిపించును దసరా
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
{{^htLoading}} {{/htLoading}}
8. చల్లని దుర్గమ్మ ఆశీస్సులతో
మీకున్న అన్ని సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
9. ఈ లోకాన్ని ఏలే శక్తి స్వరూపిణి
ఆ జగన్మాత ఆశీస్సులు మీకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
10. విజయదశమినాడు ఏ పని చేసినా
విజయం దక్కుతుందని
అందుకే ఈ రోజున విజయానికి ప్రత్యేకగా భావిస్తారు
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
11. ఓం సర్వమంగళ మాంగళ్యే
శివే సర్వార్ధ సాధకే
శరణ్యే త్రయంబకే దేవి
నారాయణి నమోస్తుతే
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
12. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని
ఆనందోత్సాహాలతో మీరు నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
13. ఈ దసరా మీ జీవితాల్లో విజయ దుందుభి మోగించాలని
ఆ దుర్గామాత కటాక్షం ఎల్లవేళలా అందరిపై ఉండాలని
కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు
14. ఈ విజయదశమి నుంచి మీకు ఎదురయ్యే
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి
మీకు రావాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
15. ఈ సంతోషకరమైన రోజున
ఆ దుర్గాదేవి మీ జీవితాన్ని
ఆనందం, శ్రేయస్సు, విజయాలతో సుసంపన్నం
చేయాలని ప్రార్థిస్తున్నాము
విజయదశమి శుభాకాంక్షలు
{{^usCountry}}{{/usCountry}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}